ఆలయంలో నిత్యం పూజలు, పునస్కారాలు చేసే ఓ పూజారి.. అదే ఆలయంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం స్వామివారి దర్శనార్థం గ్రామంలోని ఆలయానికి వచ్చారు. సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకుడి పాదాలయు నమస్కరించారు.

సంతానం కలగాలంటే మహిళతో ఆలయంలో ఒంటరిగా మాట్లాడాలని..అప్పుడే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఆ ఆలయ పూజారి సదరు దంపతులకు మాయమాటలు చెప్పాడు. అతను చెప్పిన మాటలు నిజమని నమ్మిన ఆ మహిళ అతని వెంట వెళ్లింది. అక్కడ... ఆ ఆలయ పూజారి.. సదరు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

కాగా... మహిళ ప్రతిఘటించి.. ఆ పూజారిని నెట్టేసి.. గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది. మహిళ గట్టిగా అరవడంతో భయపడిపోయిన పూజారి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... దంపతులు ఈ విషయాన్ని వెంటనే గ్రామస్థులకు తెలియజేశారు. కాగా... విషయాన్ని బయటకు రానీయకుండా దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.