Asianet News TeluguAsianet News Telugu

సూడాన్ లో భారీ అగ్నిప్రమాదం: 25మంది సజీవదహనం, మృతుల్లో 18 మంది భారతీయులు

మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చని తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

25 people killed, dozens injured in Sudan factory fire, doctor's union says
Author
Hyderabad, First Published Dec 4, 2019, 10:31 AM IST

సూడాన్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బహ్రీ కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 25 మంది మరణించగా, మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

క్షతగాత్రులను సమీప హాస్పిటల్స్‌ కు తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు..వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చని తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read:కాలిఫోర్నియాలో ఇండియన్ విద్యార్థి దారుణ హత్య

వీరిలో 18 మంది భారతీయులన్నారు. ప్రమాద సమయంలో 50 మంది భారతీయులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కార్మాగారంలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని, సహాయక సామాగ్రి సైతం పూర్తిస్థాయిలో లేవని తెలుస్తోంది. 

Also read:అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని హత్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు

మరణించిన భారతీయులను ఇంకా గుర్తించాల్సి వుంది. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం సాధ్యంకావడం లేదు. అయితే ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుల జాబితాను ఇండియన్ ఎంబసీ విడుదల చేసింది. మరోవైపు ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios