అమెరికాలోని షికాగోలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఆమపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా... ఈ హత్య కేసుకు సంబంధించి పలు విస్తుపోయే నిజలు వెలుగులోకి వస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే...  హైదరాబాద్ కి చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ ఇలినియోస్ విశ్వవిద్యాలయంలో  చదువుతోంంది. క్యాంపస్ గ్యారేజీ యజమాని కుటుంబానికి చెందిన వాహనంలోని వెనక సీట్లో ఆమె శనివారంనాడు శవమైన కనిపించింది. దాడి చేసిన డోనాల్డ్ తుర్మాన్ (26)ను పోలీసులు ఆదివారం షికాగో మెట్రో స్టేషన్ లో అరెస్టు చేశారు సోమవారంనాడు నిందితుడిపై కోర్టులో అభియోగాలు మోపారు. 

శుక్రవారం నుంచి రూత్ జార్జ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు శనివారంనాడు విశ్వవిద్యాలయం పోలీసులకు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  విశ్వవిద్యాలయంలోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. శనివారం రోజు డోనాల్డ్ తుర్మాన్ రూత్ జార్జ్ వెనక నడుస్తున్న దృశ్యాలు వాటిలో కనిపించాయి. 

రూత్ జార్జ్ తెల్లవారుజామను 1.35 గంటలకు గ్యారేజీలోకి వెళ్లింది. ఆమె వెనుకే నిందితుడు కూడా వెళ్లాడు. ఆ తర్వాత తెల్లవారు జామున 2.10 గంటలకు నిందితుడు హాల్ స్టెడ్ స్ట్రీట్ లో నడుస్తూ కనిపించాడు.  

రూత్ జార్జ్... వెనకనే డోనాల్డ్ నడుచుకుంటూ వెళ్లి.. ఆమె మెడను నొక్కేశాడు.  అనంతరం లాక్కెళ్లి కారులో పడేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కాగా.. నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెబుతున్నాడు. బాధితురాలి కారులో డోనాల్డ్ వాడిన కండోమ్ కూడా ఒకటి దొరుకిందని పోలీసులు చెప్పారు..

ఈ దారుణానికి గల కారణాన్ని  పోలీసులు వివరించారు. తనతో మాట్లాడేందుకు నిరాకరించడం వల్ల కానీ   పిలిస్తే స్పందించలేదనే కోపంతో  కానీ నిందితుడు డొనాల్డ్‌ తుర్మాన్‌ హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. 

పోలీసులు షికాగో ట్రాన్సిట్ అథారిటీ, షికాగో పీవోడీ కెమెరాలు, దాని ఇంటర్నల్ సిస్టమ్ ను పరిశీలించి నిందితుడి గురించి తెలుసుకునన్నారు. దాని ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. థుర్మాన్ గతంలో కూడా నేరాలు చేసినట్లు చెబుతున్నారు.