తిరువనంతపురం: స్నేహితులతో వేసిన జోక్ నిజమైంది. లాటరీలో ఓ యువకుడు ఫస్ట్ ప్రైజ్ పొందాడు. ఈ లాటరీ ఫలితాలు రావడానికి ముందే ఆ  యువకుడు తనకు లాటరీలో మొదటి బహుమతి వస్తోందని ధీమాను వ్యక్తం చేశారు.  

కేరళలోని తిరువోనం బంపర్ ప్రైజ్ 2020లో ఇడుక్కికి చెందిన తోవల విజయన్ అనే  24 ఏళ్ల యువకుడికి రూ. 12 కోట్లను లాటరీలో దక్కించుకొన్నాడు. విజయన్ ఎర్నాకుళంలోని కడవంత్రలోని పొన్నెత్ ఆలయంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. విజయన్ తండ్రి పెయింటర్ గా పనిచేసేవాడు. అతని సోదరి కోచిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసేది.లాక్ డౌన్ కారణంగా ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది.

కడపంత్రలో రోడ్డు పక్కన లాటరీ టిక్కెట్లను విక్రయించే అజకాచామి నుండి బీఆర్ 75 టీబీ 173964 నెంబర్ గల టిక్కెట్టును కొనుగోలు చేశాడు. లాటరీ ఫలితాలను  విడుదల చేయడానికి  కొన్ని గంటలే ముందే తనకు ఫస్ట్ ప్రైజ్ వస్తోందని ఆయన చెప్పాడు. అదే విషయం నిజమైంది. అదే రోజు లాటరీ ఫలితాలను విడుదల చేశారు.

also read:తండ్రి ఇచ్చిన నాణెం: రెండోసారి లాటరీ గెల్చుకొన్న కొడుకు

విజయన్ కు లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన నమ్మలేదు. వెంటనే ఆయన ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. ఏజెన్సీ కమీషన్, ట్యాక్స్ లు పోను రూ. 7.56 కోట్లు విజయన్  చేతికి అందుతాయి.

ఈ డబ్బుతో కొత్తగా ఇల్లును నిర్మించుకొంటానని ఆయన చెప్పాడు. అంతేకాదు తన ఇంటికి నీటి వసతిని ఏర్పాటు చేసుకొంటానని ఆయన  చెప్పారు. గతంలో కూడ ఇదే లాటరీ నుండి విజయన్ రూ. 5 వేలు గెలుచుకొన్నాడు.