మిచిగాన్: జీవితంలో ఒక్కసారైనా లాటరీలో డబ్బులు గెలుచుకోవాలనుకోవడం ప్రతి ఒక్కరికి కోరిక ఉండడం సహజం. అయితే అమెరికాలోని  ఓ వ్యక్తికి రెండు సార్లు లాటరీ దక్కింది. రెండు సార్లు  లాటరీ రావడంతో ఆయన ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్య‌క్తి 2017లో లాట‌రీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాట‌రీ టికెట్‌ను ప‌దేళ్ల క్రితం చ‌నిపోయిన‌ తండ్రి కానుక‌గా ఇచ్చిన నాణెంతో గీకి చూడ‌గా ఆ నంబ‌ర్ లాట‌రీ గెలుచుకుంది. 

also read:జాక్‌పాట్: కరోనాతో ఉద్యోగం పోయింది, లాటరీలో రూ. 46 కోట్లు దక్కాయి

దీంతో ఆయనకు రూ.30 కోట్లు అత‌డి స్వంతమయ్యాయి. ఈ విష‌యాన్ని అక్క‌డి అధికారులు సోమ‌వారం ధృవీక‌రించారు. కాగా అతడు లాట‌రీ గెలుపొందండం ఇది రెండోసారి కావ‌డం విశేషం. ఇక‌ క్లార్క్‌ ముందు లాట‌రీ నిర్వాహ‌కులు రెండు ఆప్ష‌న్‌లు ఇచ్చారు.

దీర్ఘ కాలంలో 4 మిలియ‌న్ డాల‌ర్లు తీసుకుంటారా? లేదా త‌క్ష‌ణ‌మే 2.5 మిలియ‌న్ డాల‌ర్లు తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. దీనికి అత‌డు డ‌బ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడ‌లేనంటూ 2.5 మిలియ‌న్ డాల‌ర్లు (18,95,18,750 కోట్ల రూపాయ‌లు)  తీసుకొన్నారు.

సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేక‌పోతున్నానని క్లార్క్ చెప్పాడు. కానీ నేను మ‌ళ్లీ లాట‌రీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కార‌ణ‌మ‌ని భావిస్తున్నానని చెప్పాడు. జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాను. కానీ ఇప్పుడు ద‌శ తిరిగిపోయిన‌ట్లు అనిపిస్తోందన్నారు.