నరోడా పాటియా కేసు: ముగ్గురు నిందితులకు పదేళ్ళ జైలు శిక్ష

2002 Naroda Patiya riots: 3 convicts get 10 years rigorous imprisonment
Highlights

నరోడా కేసులో ముగ్గురు పదేళ్ళ పాటు జైలు శిక్ష

అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు నరోడా పాటియా కేసులో ముగ్గురు నిందితులకు పదేళ్ళ  జైలు శిక్షను విధిస్తూ సోమవారం నాడు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఉమేష్‌ భర్వాడ్, పద్మేంద్రనీష్ రాజ్‌పుట్,  రాజ్‌కుమార్ చౌమల్‌లకు  పదేళ్ళ పాటు జైలు శిక్ష విధించింది.

2012లోనే స్పెషల్ కోర్టు ఈ ముగ్గురు నిందితులకు శిక్షను విధించింది. గుజరాత్ రాష్ట్రంలోని నరోడా పాటియాలో చోటు చేసుకొన్న అల్లర్లలో సుమారు 97 మంది మృతి చెందారు. ఈ ఘటన 2002 ఫిబ్రవరిలో జరిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకొన్న ఘటనకు కొనసాగింపుగా ఈ ఘటన జరిగింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న కరసేవకులు 57 మందిని అదే ఏడాది ఫిబ్రవరి 26వ తేదిన హత్యకు గురయ్యారు.

ఈ కేసులో గుజరాత్ మాజీ మంత్రి మాయా కొండ్యాని పై నమోదైన కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆయనపై ట్రయల్ కోర్టు 28 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ, హైకోర్టులో మాత్రం  ఈ ఆరోపనలు రుజువు కాలేదు.

గోద్రా సంఘటన జరిగిన మరునాడే నరోడా పాటియాల ఘటన చోటు చేసుకొంది. నరోడా పాటియా ప్రాంతంలో ఓ వర్గం వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వందలాది మంది దాడికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.ఈ విషయమై 2008లో సుప్రీంకోర్టు  ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేసింది.


 

loader