భారత్‌లో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసుల (Omicron Cases In India) సంఖ్య 200 మార్క్‌కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry ) మంగళవారం వివరాలను వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ కేసుల (Omicron Cases In India) సంఖ్య 200 మార్క్‌కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) మంగళవారం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినవారిలో 77 మంది కోలుకున్నట్టుగా తెలిపింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల నుంచి బయటపడినవే. ఈ రెండు రాష్ట్రాల్లో 54 చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇక, ఒమిక్రాన్ సోకిన వారిలో మహారాష్ట్రలో 28 మంది కోలుకోగా, ఢిల్లీల్లో 12 మంది కోలుకున్నారు.
దేశంలోని మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూసినట్టుగా కేంద్ర ఆరోగ్య తెలిపింది. మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్తాన్ 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్, చండీఘర్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఒమిక్రాన్ సోకిన 20 మందిలో ఇప్పటివరకు ఏవరూ కోలుకోలేదు. ఏపీలో ఒమిక్రాన్ సోకిన ఒక వ్యక్తి ఇప్పటికే కోలుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ గణంకాలు చెబుతున్నాయి.
దేశంలో ఒకవేళ వైరస్ వ్యాప్తి జరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం రాజ్యసభలో తెలిపారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో తమ అనుభవంతో.. వేరియంట్ వ్యాప్తి చెందుతున్నప్పుడు సమస్యలను ఎదుర్కోకుండా చూసుకోవడానికి ముఖ్యమైన మందుల బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Also read: డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి : డబ్ల్యూహెచ్‌వో.. ‘మహమ్మారి అంతం ఎప్పుడంటే’
గుజరాత్‌లో నైట్ కర్ఫ్యూ..
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ ( night curfew) విధించింది. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, జామ్‌నగర్, జునాఘర్ నగరాల్లో నైట్ కర్ఫ్యూను డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. రెస్టారెంట్లు, సినిమా హళ్లపై ఆంక్షాలు విధించింది.
