Asianet News TeluguAsianet News Telugu

190 ఏళ్ల నాటి అమృతాంజన్ బ్రిడ్జ్ కూల్చివేత.. లాక్‌డౌన్ వల్లే ఇది సాధ్యం

మహారాష్ట్రలో 187 ఏళ్ల నాటి చారిత్రక అమృతాంజన్ వంతెనను అధికారులు సోమవారం కూల్చివేశారు. ముంబై- పూణేలను కలుపుతూ నిర్మించిన ఈ రోడ్డులో లోనావాలా సమీపంలో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో కూల్చివేయాలని నిర్ణయించారు

190-Year-Old Amrutanjan Bridge On Mumbai-Pune Expressway Demolished
Author
Mumbai, First Published Apr 6, 2020, 5:51 PM IST

మహారాష్ట్రలో 187 ఏళ్ల నాటి చారిత్రక అమృతాంజన్ వంతెనను అధికారులు సోమవారం కూల్చివేశారు. ముంబై- పూణేలను కలుపుతూ నిర్మించిన ఈ రోడ్డులో లోనావాలా సమీపంలో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో కూల్చివేయాలని నిర్ణయించారు.

ఇందుకు న్యాయస్థానం కూడా అనుమతి మంజూరు చేయడంతో లాక్‌డౌన్ సమయం సరైనదని సోమవారాన్ని ఎంచుకున్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో 1830లో ఈ వంతెనను నిర్మించారు.

Also Read:కరోనా వైరస్ మీద ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన

రెండు దశాబ్ధాల పాటు సేవలందించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో అధికారులు గత కొంతకాలంగా వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత దీనిని కూల్చివేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్ రవాణా సంస్థకు రాయ్‌గఢ్ జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు.

కోవిడ్ 19 కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌ వేపై గణనీయంగా ట్రాఫిక్ తగ్గింది. ఈ వంతెన కూల్చివేత నేపథ్యంలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లీంచారు.

Also Read:కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం

అమృతాంజన్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనతో కూడిన భారీ హోర్డింగ్‌ను 1970లలో ఈ వంతెన వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దీనికి అమృతాంజన్ బ్రిడ్జి అనే పేరు వచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios