కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం
కరోనా వైరస్ రోగులకు సేవ చేస్తున్న వైద్యురాలిపై పొరుగింటి వ్యక్తి దురుసుగా వ్యవహరించాడు. ఆమెను దూషించడమే కాకుండా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. పొరుగింటి వ్యక్తి దాడికి ప్రయత్నించిన తీరును ఆమె తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
సూరత్: కరోనా వైరస్ రోగులకు సేవ చేస్తున్న వైద్యురాలిపై పొరుగింటి వ్యక్తి దురుసుగా వ్యవహరించాడు. ఆమెను దూషించడమే కాకుండా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. పొరుగింటి వ్యక్తి దాడికి ప్రయత్నించిన తీరును ఆమె తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని సివిల్ ఆసుపత్రిలో ఓ మహిళ వైద్యురాలు పని చేస్తోంది. ఈ ఆసుపత్రిలో కరోనా వైద్యులకు ఆమె చికిత్స అందిస్తోంది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న పొరుగింటి వ్యక్తి తమకు కరోనా అంటిస్తావా అంటూ ఆ మహిళ డాక్టర్ ను దూషించాడు. ఆమెను అక్కడి నుండి వెళ్లి పోవాలని నోటికొచ్చినట్టుగా తిట్టాడు. అంతేకాదు ఒకానొక దశలో ఆమెపై దాడికి ప్రయత్నించాడు.
also read:రెండేళ్ల పాటు ఎంపీ నిధులు కట్, జీత భత్యాల్లో 30 శాతం కోత: కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఈ తతంగాన్ని ఆ మహిళ డాక్టర్ తన సెల్‌ఫోన్ లో రికార్డు చేసింది. అయితే ఫోన్ లో రికార్డు చేయకూడదని కూడ బెదిరించాడు. అయితే ఓ మహిళ ఆ వ్యక్తిని అడ్డుకొనే ప్రయత్నం చేసింది. మిగిలిన వారంతా ఈ దృశ్యాలను చూస్తూ నిలబడ్డారు.
ఈ వీడియోను ఆ డాక్టర్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీవత్స గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. మహిళ వైద్యురాలిపై దాడికి యత్నించిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.