ఓ పక్క దేశం మొత్తం దిశ అత్యాచారం, హత్య ఘటనపై రగిలిపోతుంటే మరోపక్క దేశంలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అత్యాచారానికి గురైన ఓ యువతి అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే...ఒడిషాకు చెందిన ఓ 23 ఏళ్ల మహిళా లెక్చరర్‌పై ఆమె దూరపు బంధువు అక్టోబర్ 20న అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు అదే నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read:జస్టిస్ ఫర్ దిశ: మొబైల్ ఫోన్ దొరకలేదు, 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆమె మరణానికి కారణమైన ఆరుగురిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసులు నమోదు చేశారు.

వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మయూర్‌భంజ్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... లెక్చరర్ మరణానికి సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు జార్పోఖారియా పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ శరత్ కుమార్ మహాలిక్‌ బదిలీ చేయంతో పాటు సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రశాంత్ స్వైన్‌ను సస్పెండ్ చేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై లోక్ సభలో చర్చకు పట్టుబట్టారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. లోక్ సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు వాయిదా తీర్మాణం ఇచ్చారు. 

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుపోతున్నాయని ఆరోపించారు. దిశ హత్యపై లోక్ సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 

Also read:తెలంగాణ నిర్భయ హత్య: నిందితుల వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

దిశ హత్య ఘటన తమను కలచివేసిందని స్పష్టించారు. ఇలాంటి ఘటనను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. దిశ హత్య ఘటనపై తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. జీరో అవర్లో దిశ ఘటనపై చర్చిద్దామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. మధ్మాహ్నాం 12 గంటలకు లోక్ సభలో దిశ ఘటనపై చర్చ జరపనున్నట్లు తెలిపారు.