Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్.. బీజేపీ నేత హత్య కేసు.. 15 మంది దోషులకు మరణ శిక్ష

కేరళకు చెందిన బీజేపీ నాయకుడి హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష పడింది. 2021లో ఈ హత్య జరగ్గా.. ఈ నెల 20న కోర్టు (Kerala court) 15 మందిని దోషులుగా తేల్చింది. (15 sentenced to death in Ranjith Srinivasan murder case) తాజాగా వారికి మరణ శిక్ష ఖరారు చేసింది.

15 sentenced to death in Ranjith Srinivasan murder case..ISR
Author
First Published Jan 30, 2024, 11:56 AM IST

Ranjith Srinivasan murder case : 2021 డిసెంబర్ లో బీజేపీ నేత, న్యాయవాది రంజీత్ శ్రీనివాసన్ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డీపీఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా అదనపు సెషన్స్ కోర్టు మావెలికర జనవరి 20న తీర్పు వెలువరించింది.

గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. ఫాస్టెస్ట్ రూట్ లో వెళ్తే మెట్లపైకి తీసుకెళ్లి.. వీడియో వైరల్

ఈ హత్యలో ప్రధానంగా ఎనిమిది మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. నిజాం, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, సలాం, అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మున్షాద్, జజీబ్, నవాజ్, షెమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ, షమ్నాజ్ లను దోషులుగా నిర్ధారించారు.

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. మీ జిల్లాకు ఎవరొచ్చారో తెలుసా ?

2021 డిసెంబర్ 19న ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాసన్ ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. ఎస్డీపీఐ కార్యకర్త కేఎస్ షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన కుటుంబ సభ్యుల ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటన ఆ సమయంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios