గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. ఫాస్టెస్ట్ రూట్ లో వెళ్తే మెట్లపైకి తీసుకెళ్లి.. వీడియో వైరల్
గూగుల్ మ్యాప్స్ ను చూస్తూ కారులో వెళ్తున్న కొందరు స్నేహితులకు వింత అనుభవం ఎదురైంది. ఆ మ్యాప్ కారును మెట్లపైకి తీసుకెళ్లి వదిలిపెట్టింది. (Google Map showed the wrong way. A car that went up the stairs in Tamil Nadu and stopped) ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్త ప్రాంతానికి కారులో గానీ, బైక్ పై వెళ్తుంటే ప్రస్తుతం అందరూ నమ్ముకునేది గూగుల్ మ్యాప్ నే. మనం వెళ్లాల్సిన ప్రదేశం, మనం ఉన్న ప్రాంతం సెలెక్ట్ చేస్తే ఏ ఏ దారిలో వెళ్లొచ్చు.. ఏ వాహనంలో వెళ్తే ఎంత సేపట్లో వెళ్లొచ్చు.. మధ్యలో వచ్చే ప్రదేశాలేవి ? దారిలో ఉండే పెట్రోల్ బంకులు, రెస్టారెంట్ లతో సహా అన్ని వివరాలు చూపిస్తాయి. చాలా సందర్భాల్లో ఇవి కచ్చితంగానే పని చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తప్పుగా చూపించి ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి ఘటనలు ఇటీవల బాగానే పెరిగాయి.
కొత్త పార్టీ పెట్టనున్న విజయ్ దళపతి.. పేరు కూడా ఖరారు..
తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని కారు నడుపుతుంటే.. అది ఓ మెట్ల పై నుంచి తీసుకెళ్లింది. ఇటు వెనక్కి వెళ్లలేక, ఇటూ ముందుకు వెళ్లలేక కారులో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది కొండలూరు నగరంలో వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన కొందరు స్నేహితులు వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఎస్ యూవీలో తమిళనాడులోని 'గూడలూరు'లోని 'హాలిడే స్పాట్'కు వచ్చారు. తరువాత కారులో కర్ణాటకకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరిగి వెళ్లేటప్పుడు వారు గూగుల్ మ్యాప్స్ ‘ఫాస్టెస్ట్ రూట్’ ఆప్షన్ ను ఎంచుకున్నారు. దీంతో మాప్స్ లో కొత్త దారి కనిపించింది.
దాని ప్రకారం డ్రైవర్ కారును నడిపాడు. మ్యాప్ లో చూపిన విధంగా కారు వెళ్తోంది. అయితే ఆ మ్యాప్ నేరుగా కొండలూరులోని నివాస ప్రాంతంలో ఉన్న ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. మళ్లీ మ్యాప్ ఇంకో దారి చూపించింది. దాని ప్రకారం వెళ్తే అది ఓ మెట్లపైకి తీసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న వారందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. కారును వెనక్కి, ముందుకు తీసుకెళ్లే అవకాశం వారికి కనిపించలేదు.
అయోధ్యకు వెళ్లి వచ్చినందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ కు పత్వా, ప్రాణహాని..
ఈ విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికుల సాయంతో మెళ్ల మెళ్లగా ఆ వాహానాన్ని మెట్లు దించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని 'గూడలూర్' ప్రాంతాన్ని పర్యాటకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ, కర్ణాటకల ట్రై జంక్షన్ వద్ద ఉంది. ఊటీ హిల్ స్టేషన్‌కు వెళ్లే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.