దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలోనే సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.. తాజాగా అవి దక్షిణ భారతానికి పాకాయి. ఇటీవల కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. కాగా... ఈ సభలో మహారాష్ట్రకి చెందిన ఎంఐఎం నేత, మాజీ ఎమ్మెల్యే వారీస్ పఠాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Also Read ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపించి ఉంటే.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్...

స్వాతంత్య్రం అన్నది అడుక్కుంటే వచ్చేది కాదని అన్నారు. మేం కేవలం 15కోట్ల మందిమే ఉన్నాం కానీ.. మీ 100కోట్లమందిపై ఆధిపత్యం చూపగలం అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేల్చుకుందామా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గతంలో అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్ధీన్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 అప్పట్లో 15నిమిషాలు గడువిచ్చి.. పోలీసులని పక్కకి తప్పిస్తే మేమేంటో చూపిస్తామంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత అరెస్ట్, షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. మరోసారి కేసు నమోదైంది. అయితే ఇప్పుడు వారిస్ పఠాన్ కూడా.. అక్బరుద్దీన్ తరహాలోనే వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.