చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్కౌంటర్, 14 మంది మావోల మృతి

14 Naxals killed in encounter with security forces near Sukma
Highlights

మావోయిస్టులకు మరో ఎదురురెబ్బ తగిలింది. చత్తీస్ ఘడ్ లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 14 మంది మావోలు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 

మావోయిస్టులకు మరో ఎదురురెబ్బ తగిలింది. చత్తీస్ ఘడ్ లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో 14 మంది మావోలు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 

చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.  గొల్లపల్లి సమీపంలోని కన్నాయి గూడ అటవీ ప్రాంతం వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 14 మంది మావోలు మృతిచెందినట్లు జిల్లా ఎస్పీ దృవీకరించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్న మావోల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో 16 ఆముధాలను గుర్తించిన భద్రతాదళాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి.  ఇప్పటికే గతంలో జరిగిన ఎన్కౌంటర్లలో ముఖ్య నాయకులను కోల్పోయి దెబ్బతిన మావోయిస్టు దళాలకు ఈ ఎన్కౌంటర్ ద్వారా మరో ఎదురుదెబ్బ తగిలింది. 
       

loader