ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నాగ్లాఖాంగార్ లో బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై బుధవారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఢిల్లీ నుండి బీహార్ లోని మోతిహరికి బస్సు వెళ్తోంది. బస్సు నాగ్లాఖాంగార్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని సీఎం ఆదేశించారు.

Also read:కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి


ఢిల్లీ నుండి బీహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టింది.దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Scroll to load tweet…