కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గ్రానైట్ లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఆటో డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది. అరగంటపాటు పోలీసులు ఈ మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.మృతులను మేక బాబు,మేక నర్సయ్య, గడ్డం అంజయ్య, మేక శేఖర్ గా గుర్తించారు. 

ఈ ప్రమాదంలో మరణించిన వారిని కొడిమ్యాల మండలం పూడూర్ నివాసులుగా గుర్తించారు. టాటా ఏస్ వాహనం కరీంనగర్ నుండి పూడూర్ కు  వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 

ఈ లారీ మంత్రికి చెందిన గ్రానైౌట్ ఫ్యాక్టరీకి చెందిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.