ఉత్తరప్రదేశ్‌లో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. గోధుమలు ఇచ్చి ఐస్ క్రీం కొని తిన్న ఆ బాలికకు ఓ చెల్లి ఉంది. తనకూ ఐస్ క్రీం కావాలని చెల్లి అడగింది. కానీ, అప్పటికే ఐస్ క్రీం అమ్మేవాడు వెళ్లిపోయాడు. ఎంత బుజ్జగించినా చెల్లి ఊరుకోకపోగా.. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో తల్లిదండ్రులు తనను కొడతారని భయంతో ఉరివేసుకుంది.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలిక రెండు దోసిళ్ల గోధుమలు ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారనే భయంతో ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కాన్పూర్‌లోని భవానిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఓ ఐస్ క్రీం అమ్మకందారు అటువైపుగా వెళ్లుతుండగా ఆ బాలిక ఆపింది. రెండు దోసిళ్ల గోధుమలను ఇచ్చి ఐస్ క్రీం తీసుకుని తినేసింది. కానీ, అప్పుడే తొమ్మిదేళ్ల చెల్లి కూడా తనకు ఐస్ క్రీం కావాలని మారం చేసింది. అప్పటికే ఆ ఐస్ క్రీం అమ్మకందారుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చెల్లికి ఎంత సర్దిచెప్పినా వినలేదు. తనకూ ఐస్ క్రీం కావాల్సిందేనని పట్టుపట్టింది. చివరకు అక్కను బ్లాక్ మెయిల్ చేసింది. తనకు ఐస్ క్రీం కొనివ్వకుంటే పేరెంట్స్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.
Also Read: కుక్కను చంపిన కేసులో వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్ష
దీంతో 11 ఏళ్ల బాలిక భయపడింది. తల్లిదండ్రులకు చెల్లి ఫిర్యాదు చేస్తే తనను తిడ తారని అనుకుంది. అందుకే ఆత్మహత్య చేసుకుంది.
గోధుమ పంట పొలాల్లో పని చేస్తున్న తల్లి దండ్రులు ఇంటికి తిరిగి రాగానే ఖంగుతిన్నారు. పెద్ద కూతురు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.
పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ పంపించారు. లీగల్ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
