మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కుక్కను ఐరన్ రాడ్‌తో పొడిచి చంపాడు. ఈ కేసులో మఖాన్ సింగ్ దోషిగా తేలాడు. కోర్టు ఆయనకు ఏడాది కటిన కారాగార శిక్ష, రూ. 1,000 జరిమానా విధించింది. 

భిండ్: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కుక్కను చంపాడని కేసు నమోదైంది. ఆ కేసులో అతనికి శిక్ష కూడా పడింది. ఏడాది కాలంపాటు కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు రూ. 1,000 జరిమానా కూడా వేసింది. 2019లో కుక్కను చంపిన ఘటన చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

48 ఏళ్ల మఖాన్ సింగ్‌కు ఈ శిక్ష పడింది. కారాగార శిక్షతోపాటు రూ. 1,000 జరిమానా కూడా విధించింది. జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాకేశ్ కుమార్ కుష్వాహా ఈ తీర్పు వెల్లడించారు. 

Also Read: ఢిల్లీలో సహజీవన భాగస్వామి హత్య.. 12 కి.మీల దూరంలో డెడ్ బాడీ

2019లో ఓ కుక్క మఖాన్ సింగ్ పై ఉరుముతూ మొరిగింది. రౌపురా గ్రామంలో ఆ కుక్కను ఓ ఐరన్ రాడ్‌తో పొడిచి చంపేశాడు. 2019 ఏపర్ిల్ 30న ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత ఐపీసీలోని సెక్షన్ 429 (జంతువులను చంపేసినందుకు) కింద కేసు ఫైల్ అయింది. ఈ కేసులో మఖాన్ సింగ్ దోషిగా తేలాడు. దీంతో కోర్టు ఆయనకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 1,000 జరిమానా విధించింది. ఈ తీర్పు మంగళవారం వెలువడింది.