కాబుల్ లోని గురుద్వారాపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 100 మంది సిక్కులు, హిందువులకు ఇ-వీసాలు మంజూరు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ దేశం కాబూల్‌లోని గురుద్వారాలో శనివారం ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న 100 మందికి పైగా సిక్కులు, హిందువులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఇ-వీసాలు మంజూరు చేసిందని ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. కాబూల్‌లోని బాగ్-ఎ బాలా పరిసరాల్లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం తెల్లవారుజామున ఈ దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదులు, తాలిబాన్ ల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి పాల్పడిన ముగ్గురిని తాలిబన్ బలగాలు హతమార్చాయని పజ్వాక్ వార్తా సంస్థ నివేదించింది. మైనారిటీ కమ్యూనిటీ ప్రార్థనా స్థలానికి చేరుకోవడానికి ముందే పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున దాడి జరిగినప్పుడు కనీసం 30 మంది గురుద్వారా లోపల ఉన్నారు. ‘‘మొదట ముష్కరులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు. దీని వల్ల గురుద్వారా గేటు దగ్గర మంటలు చెలరేగాయి’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధిని అసోసియేటెడ్ ప్రెస్ తో తెలిపారు.
Assam Floods: అసోం వరదలు.. 63 మంది మృతి.. 32 లక్షల మందిపై ప్రభావం !
ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండిచారు. దీనిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. భక్తుల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ‘‘ కాబూల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై జరిగిన పిరికి ఉగ్రవాద దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ అనాగరిక దాడిని నేను ఖండిస్తున్నాను. భక్తుల భద్రత శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను ’’ అని ఆయన ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా గురుద్వారాపై జరిగిన దాడిని ఖండించారు. దీనిని పిరికిపంద దాడి గా అభివర్ణించారు. ఘటన తరువాత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. ‘‘గురుద్వారా కార్తె పర్వాన్‌పై జరిగిన పిరికిపంద దాడిని అందరూ తీవ్రంగా ఖండించాలి. దాడి వార్త అందినప్పటి నుండి మేము పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. మాకు సమాజ శ్రేయస్సే ప్రధానం’’ అని ఆయన ట్వీట్ చేశారు.
స్పైస్ జెట్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్..
‘‘ కాబుల్ నగరంలోని పవిత్ర గురుద్వారాపై దాడిపై వస్తున్ననివేదికలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం వేచి ఉన్నాము ’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. కాగా ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘన్ రాజధానిలో మైనారిటీల భద్రతను నిర్ధారించడానికి తక్షణ సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. ‘‘ కాబూల్‌లోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భక్తులపై కాల్పులు జరిగినట్లు వార్తలు విన్నాను, అందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను. కాబూల్‌లోని మైనారిటీల భద్రతను నిర్ధారించడానికి తక్షణ సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని, విదేశీ వ్యవహారాల శాఖను కోరుతున్నాను’’ అని మాన్ ట్వీట్ చేశారు.
