బిహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఒక్కసారిగా మంటల చెలరేగాయి.
బిహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి.. స్పైస్ జెట్ విమానాన్ని తిరిగి పాట్నా విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేశారు. విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టుగా సమాచారం. ఈ ఘటన చోటుచేసుకున్న వెంటనే వెంటనే విమానాశ్రయ యంత్రాంగం అప్రమత్తమైంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను విమానం నుంచి దింపేశారు.
విమానంలో మంటలు చెలరేగినప్పుడు 185 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే అందరూ సురక్షితంగా రక్షించబడ్డారని చెప్పారు. ఇక, విమానం అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో.. అవసరమైతే వైద్య చికిత్స అందించేందుకు ఎయిర్‌పోర్ట్ వెలువల అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే అగ్నిమాపక యంత్రాలను కూడా తీసుకొచ్చారు.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో ఒకదాని నుంచి పొగలు రావడం కనిపించింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయతే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు.
