Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట: వీవీఐపీల తాకిడి, విమానాలకు పార్కింగ్ సమస్య?

 రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  ఈ నెల  22న అయోధ్యకు వీఐపీలు, వీవీఐపీలు క్యూ కట్టే అవకాశం ఉంది.

100 chartered jets are landing in Ayodhya...: New airport has a parking problem  lns
Author
First Published Jan 20, 2024, 10:50 AM IST

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల  22న జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన  పలువురు ప్రముఖులను  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్  ఆహ్వానించింది.  ఈ కార్యక్రమానికి సుమారు  7 వేల మందిని  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది.  అయోధ్యలో  రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వీఐపీ, వీవీఐపీలు హాజరు కానున్నారు. దీంతో  అయోధ్య ఎయిర్ పోర్టు చాలా బిజీగా  మారే అవకాశం ఉంది.  వీవీఐపీలు, వీఐపీలు  ప్రత్యేక  విమానాల్లో  అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది. అయితే అయోధ్యలో ఈ విమానాలను పార్కింగ్ సమస్యగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నెల 22న అయోధ్యలోని కొత్త విమానాశ్రయంలో  100 చార్టర్డ్ ఫ్లైట్స్  ల్యాండ్ అవుతాయని  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్  ప్రాణ ప్రతిష్ట ఈవెంట్ కోసం  చార్టర్డ్ విమానాల ల్యాండింగ్ కోసం  ఇప్పటికే  40 కంటే ఎక్కువ అభ్యర్ధనలు వచ్చాయని  యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 

మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎనిమిది  ఏఫ్రాన్ లున్నాయి. ఇవి 200 సీట్ల చిన్న పాటి విమానాలను  పార్కింగ్ కు ఉపయోగపడుతాయి.  అయితే  నాలుగు పార్కింగ్ స్లాట్లు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమానాలు ఆక్రమించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

also read:అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట: జనవరి 22న సెలవులు లేదా హాఫ్ డే సెలవు ప్రకటించిన రాష్ట్రాలివే...

ఈ నెల  22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్నందున  విఐపీ, వీవీఐపీలను  అయోధ్య విమానాశ్రయంలో  దింపిన తర్వాత విమానాలు తిరిగి వెళ్లేలా విమానాశ్రయ అధికారులు  చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో ప్రతి చార్టర్డ్   విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ల కోసం నిర్ధేశిత కాలాన్ని కేటాయించనున్నారు. దీంతో  రద్దీని సమర్ధవంతంగా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అయోధ్య నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయలు దేరిన తర్వాతే  విమానాలు ల్యాండ్ అవడానికి ప్రముఖులను డి బోర్డ్ చేయడానికి  అనుమతించనున్నారు.

అయోధ్యకు సమీపంలోని  1000 కి.మీ. పరిధిలో డజను విమానాశ్రయాలు అయోధ్యలో ప్రముఖులను దించిన తర్వాత  రాత్రిపూట తమ పార్కింగ్ స్థలాలను  ఎంచుకోవాలని అధికారులు  సూచిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

ఖజురహో, జబల్ పూర్, భోపాల్, డెహ్రాడూన్, లక్నో, ప్రయాగ్ రాజ్,  కాన్పూర్, వారణాసి, ఖుషీనగర్, గోరఖ్ పూర్, గయా , దేవఘర్ వంటి డజను ప్రత్యామ్నాయ ఎయిర్ పోర్టులను అధికారులు సూచిస్తున్నారు.

ఈ నెల  21 నుండి  23 మధ్య  30 పార్కింగ్ స్లాట్ల కోసం  రిక్వెస్టులు స్వీకరించినట్టుగా వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్  ఎయిర్ పోర్టు డైరెక్టర్  ను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొన్నాయి.

లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒకేసారి  10 పెద్ద విమానాలు, ఒక చిన్న విమానం కాకుండా 12 షెడ్యూల్ విమానాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంది.అయోధ్య నుండి చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయానికి  39 నిమిషాలు పడుతుంది.అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం  నుండి భోపాల్ లోని రాజా భోజ్ విమానాశ్రయానికి గంట 16 నిమిషాలు పడుతుంది.

**
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios