Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట: జనవరి 22న సెలవులు లేదా హాఫ్ డే సెలవు ప్రకటించిన రాష్ట్రాలివే...

అయోధ్యలో రామ మందిర  ప్రారంభోత్సవం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. 

Ram mandir inaguaration:These States declared holiday or half day on January 22, list here lns
Author
First Published Jan 20, 2024, 10:10 AM IST

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు  ఈ నెల  22న హాఫ్ డే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడ  సెలవును ప్రకటించాయి. 

అయోధ్యలో  రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులకు  ఆహ్వానాలు కూడ పంపారు.  అయోధ్యలోని రామమందిరంలోని గర్భగుడిలో  ఇప్పటికే రామ్ లల్లా విగ్రహన్ని ప్రతిష్టించారు.ఈ నెల  23 నుండి సాధారణ భక్తులకు  ప్రవేశం కల్పించనున్నారు.  


మధ్యప్రదేశ్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఈ నెల  22న  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  విద్యా సంస్థలకు  ప్రభుత్వం సెలవు ప్రకటించింది.అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  మద్యం దుకాణాలు తెరవ వద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడ మూసివేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు  ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నట్టుగా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 హర్యానా: ఈ నెల  22న  విద్యాసంస్థలకు  హర్యానా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని సోమవారం నాడు మద్యం విక్రయాలపై నిషేధం విధించింది.

ఒడిశా:ఈ నెల  22వ తేదీన అయోధ్యలో  రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాన్ని హాఫ్ డే సెలవు ప్రకటించింది ప్రభుత్వం.రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు,రెవిన్యూ, మెజిస్టీరియల్ కోర్టులు సోమవారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి పనిచేయనున్నాయి.

అసాం:ఈ నెల  22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  రాష్ట్రంలోని  అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించింది.  

గుజరాత్: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు  అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది ప్రభుత్వం.ఈ మేరకు  ఈ నెల  18వ తేదీన  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజస్థాన్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఈ నెల  22న రాజస్థాన్ లో హాఫ్ డే సెలవు ప్రకటించింది ప్రభుత్వం.బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో  సీఎం భజన్ లాల్ శర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. 

గోవా: ఈ నెల  22న  అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  గోవా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

 త్రిపుర:త్రిపుర రాష్ట్రంలో  ఈ నెల  22వ తేదీన  ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు  మధ్యాహ్నం రెండు న్నర గంటల వరకు  మూసి వేస్తారని  అదికారులు తెలిపారు. ఈ మేరకు  త్రిపుర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఆసిమ్ సహాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఛత్తీస్ ఘడ్: ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడ  ఈ నెల  22న  మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు  ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. అయోధ్యలో  రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా  ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  విష్ణు‌దేవ్ సాయి  ప్రకటించారు. 

ఉత్తరా ఖండ్: ఈ నెల  22న  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు  మూసి వేయనున్నట్టుగా  ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని సెలవు ఇచ్చినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్ర: అయోధ్యలో రామ మందిరం  ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  ఈ నెల 22న ప్రభుత్వ కార్యాలయాలకు  సెలవు ప్రకటించింది.ఈ మేరకు శుక్రవారం నాడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

పాండిచ్చేరి: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారంనాడు  పాండిచ్చేరిలోని ప్రభుత్వ కార్యాలయాలకు  సెలవు ప్రకటించారు ముఖ్యమంత్రి రంగస్వామి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios