మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాత్ నారాయణ్ చౌదరి అనే వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఓ వాహనాంలో చోప్రా గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యారు.

అనంతరం అదే వాహనంలో తిరిగి తన స్వగ్రామాలైన చించోట్, మేహుల్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి హింగోలా సమీపంలో వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది.

ఈ ఘటనలో చౌదరి, ఆయన భార్య సహా పది మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పదేళ్ల చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:

దిగ్భ్రాంతి కరమే, వేడుక చేసుకున్నారు: నిర్భయ వాదనల్లో దిశ ఘటన ప్రస్తావన

అక్రమ సంబంధం, ప్రియురాలి భర్తను చంపేసి... ‘దృశ్యం’ సినిమా రేంజ్ లో...

భారత్ లో మూడో కరోనా వైరస్ కేసు: ఇది కూడా కేరళలోనే....