న్యూఢిల్లీ: భారతదేశంలో మూడో వైరస్ కేసు నమోదైంది. ఇది కూడా కేరళలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే కేరళలో ముగ్గురు కరోనా  వైరస్ కు గురై చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య మూడుకు చేరుకుంది. 

ఆ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కూడా ధ్రువీకరించారు. కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలో తాజా కేసు నమోదైంది. మూడో రోగి కూడా చైనా నుంచే తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.

See Vedio: కరోనా వైరస్ : తప్పించుకున్నాం..సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న విద్యార్థులు 

మూడో రోగి కాసర్ గోడ్ జిల్లా కంజన్ గడ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు శైలజ చెప్పారు. ఆ రోగి చైనాలోని వూహన్ నుంచి తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపారు 

కేరళ ప్రభుత్వం దాదాపు 2 వేల మందిని అబ్జర్వేషన్ లో పెట్టింది. వారందరూ వివిధ ఆస్పత్రుల్లో ఉన్నారు. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారైన మూడు కేసుల్లో  తొలి కేసు త్రిసూరులో గురువారంనాడు నిర్ధారణ అయింది. ఈమె చైనాలోని వూహాన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థిని.  

భారతదేశంలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వూహన్ విశ్వవిద్యాలయం నుంచి జనవరి 24వ తేదీన తిరిగి వచ్చిన విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలప్పుజాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డులో అతన్ని చేర్చారు. 

Also Read: భారత్ లో రెండో కరోనా వైరస్ కేసు: భారత్ సంచలన ఆదేశాలు

రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో అతనిపై తగిన దృష్టి కేంద్రీకరిస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ వైరాలజీ సంస్థ నుంచి ఇంకా నివేదిక రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కె. కె. శైలజ చెప్పారు.