న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణలో దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ప్రస్తావనకు వచ్చింది. ఉరిశిక్ష పడిన నిర్భయ కేసు దోషులు మరింత సమయం పొందడానికి అర్హులు కారని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. 

నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను ఎత్తేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆదివారం తన వాదనలు వినిపించారు. దోషులందరూ కావాలనే ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగేలా చూసుకుంటున్నారని, న్యాయవ్యవస్థతో ఆటలాడుకుంటున్నారని ఆయన జస్టిస్ సురేష్ కయత్ కు తెలిపారు. 

Also Read: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: విచారణ ప్రారంభించిన సుప్రీం కమిటీ

ఈ సందదర్భంగా తుషార్ మెహతా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు. అక్కడ జరిగింది దిగ్భ్రాంతికరమే కానీ పర్జలు వేడక చేసుకున్నారని ఆయన అన్నారు. నిర్భయ కేసు దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. దోషి పవన్ గుప్తా ఇప్పటికీ క్యూరేటివ్, మెర్సీపిటిషన్లు వేయకుండా జాప్యం చేస్తున్నాడని ఆయన అన్నారు. నలుగురు దోషులను కలిపి ఉరి తీయాల్సిన అవసరం లేదని, పిటిషన్లు పెండింగులో లేనివారని ఉరి తీయవచ్చునని ఆయన అన్నారు.

Also Read: నిర్భయ దోషుల ఉరిపై స్టే ఎత్తివేత పిటిషన్: తీర్పు రిజర్వ్

కేంద్రం వేసిన పిటిషన్ పై దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ అభ్యంతరం తెలిపారు ఉరిశిక్ష అమలుకు సుప్రీంకోర్టు గానీ రాజ్యాంగం గానీ ఏ విధమైన గడువును కూడా నిర్దేశించలేవని చెప్పారు ఈ విషయంలో న్యాయస్థానం కూడా ఎందుకు తొందరపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు