కరీంనగర్: కరీంనగర్ జిల్లా  కాకతీయ కాలువలో కారులో జల సమాధిగా మారిన రాధిక కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం రాధిక కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం రాధిక కుటుంబం మొత్తం జల సమాధి కావడంతో కుటుంబసభ్యులు కన్నీంటి పర్యంతమౌతున్నారు.

కరీంనగర్ జిల్లాలో  టూరుకు వెళ్తున్న సమయంలో  కాకతీయ కెనాల్‌లో కారులోనే సత్యనారాయణరెడ్డి, రాధిక, వినయశ్రీ మృతి చెందిన విషయం ఈ నెల 17వ తేదీన వెలుగు చూసింది.  కాకాకతీయ కాలువ నుండి కారును పోలీసులు వెలికి తీశారు.

Also read:పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి: బర్త్‌డే‌కు ముందే మృతి చెందిన వినయశ్రీ

ఈ ఏడాది జనవరి 26వ తేదీన  టూరుకు వెళ్తున్నట్టు చెప్పి రాధిక కుటుంబం కారులో బయలుదేరింది.అయితే కారులోనే ఈ ముగ్గురు కాకతీయ కెనాల్‌లో జల సమాధి అయ్యారు.  అయితే వీరి కారు ఎలా కాలువలో పడిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

2012లో సమ్మక్క సారక్క  దర్శనం కోసం వెళ్లి వస్తున్న సమయంలో   సిరిసిల్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  రాధిక కొడుకు మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది.  ఆ సమయంలో రాధిక భర్త సత్యనారాయణ రెడ్డి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసేవాడు. 

Also read:సోదరి రాధిక ఫ్యామిలీ మృతి: అదృశ్యంపై ఎమ్మెల్యేకు ముందే తెలిసినా... అనుమానాలు

కొడుకు మృతితో రియల్ ఏస్టేట్ వ్యాపారం సత్యనారాయణరెడ్డి తగ్గించినట్టుగా ఆయన షాపులో పనిచేసే గుమాస్తా నర్సింగ్ చెప్పారు. ఈ విషయమై ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు.

కొడుకు మృతి నుండి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకొంటుంది. రాధిక కూతురు వినయశ్రీ మరో ఆరు మాసాల్లో డెంటల్ కోర్సు పూర్తి కానుంది.  ఈ సమయంలోనే కారు ప్రమాదంలో రాధిక కుటుంబం మృతి చెందడం  తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.