Asianet News TeluguAsianet News Telugu

10 అడుగుల సొరంగం తవ్వి బ్యాంక్ నుంచి 1.8 కేజీల బంగారం చోరీ.. కాన్పూర్ లో ఘటన.. వాటి విలువ కోటి రూపాయిలకు పైనే

బ్యాంక్ కు కన్నం వేసేందుకు దొంగలు కొత్తదారిని ఎంచుకున్నారు. బ్యాంక్ వెలుపల నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు ఓ సొరంగం తవ్వారు. అనంతరం అందులో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వాటి విలువ కోటి రూపాయిలకు పైనే ఉంటుంది. ఈ ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. 
 

1.8 kg gold was stolen from the bank by digging a 10 feet tunnel.. The incident in Kanpur.. Their value is more than one crore rupees.
Author
First Published Dec 24, 2022, 8:57 AM IST

దొంగలు రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. చోరీ చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఊరికి దూరంగా ఉండే ఇళ్లపై కన్నేసేవారు. అక్కడి చోరీలకు పాల్పడి సొత్తును ఎత్తుకెళ్లేవారు. కొంత కాలం నుంచి వారు కూడా ట్రెండ్ మార్చారు. ఇళ్లల్లో ఎవరూ బంగారం ఉంచుకోవడం లేదని అనుకుంటన్నారో ఏమో ఏకంగా బ్యాంకులకే కన్నం వేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భానుతి బ్రాంచ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి నాలుగు అడుగుల వెడల్పుతో 10 అడుగుల సొరంగం తవ్వి మరీ ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సొరంగం ద్వారా దొంగలు నేరుగా స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించారు. 

పోర్న్ స్టార్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వీడియో తీసుకుని ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం, పరిస్తితి విషమం..

స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న గోల్డ్ చెస్ట్ ను పగులగొట్టారు. అందులోని 1.8 కేజీల బంగారాన్ని దోచుకున్నారు. అలాగే పక్కనే రూ.32 లక్షలు ఉన్న క్యాష్ చెస్ట్ ను తెరవలేకపోయారు. అనంతరం తమ పని పూర్తి చేసుకొని దొంగలు సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ ధుల్ అక్కడికి చేరుకున్నారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 

అయితే చోరీకి గురైన బంగారం అంచనాను తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులకు గంటల తరబడి సమయం పట్టింది. దీని బరువు 1.8 కిలోలకు పైగా ఉందని, దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని డీసీపీ విజయ్ ధూల్ తెలిపారు. ఈ దోపిడిపై పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు దర్యాప్తు చేపట్టారని, బ్యాంక్ స్ట్రాంగ్‌రూమ్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలం నుంచి సొరంగం తవ్వినట్టు వారు గుర్తించారని తెలిపారు.

‘‘బ్యాంకుకు చెందిన వ్యక్తే నిపుణులైన నేరగాళ్లతో కలిసి ఈ దోపికి పాల్పడి ఉంటాడు. స్ట్రాంగ్‌రూమ్ నుంచి కొన్ని వేలుముద్రలు, అలాగే కొన్ని ఆధారాలు లభించాయి. దోపిడీ కేసును ఛేదించడానికి అవి సాయపడుతాయి.’’ అని డీసీపీ ధూల్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు. ‘‘దొంగలు కచ్చితంగా బ్యాంకును నిశితంగా పరిశీలించి ఉంటారు.  బ్యాంకు నిర్మాణం, స్ట్రాంగ్‌రూమ్, గోల్డ్ చెస్ట్ పై వారికి బాగా అవగాహన ఉంటుదని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి.’’ అని ఆయన అన్నారు. 

ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం బ్యాంకు అధికారులు బ్రాంచ్ ను ఓపెన్ చేసి, స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు కమిషనర్ బీపీ జోగ్‌దంద్ తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి దొంగలు ప్రవేశించిన సొరంగం కూడా బ్యాంకు అధికారులు గుర్తించారని చెప్పారు.

'అబ్దుల్ బారీ వంటి ముస్లింలు యాదృచ్ఛికంగా భారత్ లో ఉన్నారు. కానీ, వారు భారతీయులు కాదు': మొహ్సిన్ రజా

కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ బ్యాంకు వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. దోపిడీని ఛేదించేందుకు సీనియర్‌ అధికారుల నేతృత్వంలో పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు జోగ్‌దండ్‌ ‘పీటీఐ’కి తెలిపారు. ప్రస్తుతం చోరీకి గురైన బంగారం 29 మందికి చెందినదని, వారంతా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారని బ్యాంక్ మేనేజర్ నీరజ్ రాయ్ పోలీసులకు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios