Asianet News TeluguAsianet News Telugu

'అబ్దుల్ బారీ వంటి ముస్లింలు యాదృచ్ఛికంగా భారత్ లో ఉన్నారు. కానీ, వారు భారతీయులు కాదు': మొహ్సిన్ రజా

భారత దేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని ఆర్జేడీ నేత అబ్దుల్ బరి సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మొహిసిన్ రజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఆరోపణలు చేసేవారు అనుకోకుండా వచ్చిన అవకాశం వల్ల భారత దేశంలో ఉంటున్నవారని, వారు భారతీయులు కాదని అన్నారు.

BJPs Mohsin Raza slams RJD leader over 'Muslims insecure in India' remark
Author
First Published Dec 24, 2022, 4:39 AM IST

భారత దేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని బీహార్ కు చెందిన ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదాస్పద ప్రకటన చేశారు. అతని ప్రకటనతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆ  వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్, బీజేపీ నేత మొహ్సిన్ రజా మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తులు అనుకోకుండా వచ్చిన అవకాశం  వల్ల  భారతదేశంలోనే ఉండిపోయారనీ, కానీ..వారు భారతీయులు కాదని అన్నారు. అబ్దుల్ బారీ సిద్ధిఖీ లాంటి ముస్లింలు ఎప్పుడూ దేశాన్ని ప్రశ్నిస్తుంటారనీ, అలాంటి ముస్లింలు యాదృచ్ఛికంగా భారతదేశంలోనే ఉండిపోయారనీ, ఎంపిక ద్వారా వారు భారతదేశాన్ని ఎన్నుకోలేదని మొహ్సిన్ ఆరోపించారు.  

భారతదేశంలో అలాంటి భాష మాట్లాడే వారు, వారి పూర్వీకులు పాకిస్తాన్‌కు వెళ్లారని లేదా వెళ్లాలని కోరుకున్నారని మొహ్సిన్ రజా అన్నారు. నేటికి కూడా వారి మనసులో కూడా అదే భావన ఉందనీ, కానీ వారు భారతదేశంలోనే ఉండిపోయినవారని ఎద్దేవా చేశారు. వివిధ అవకాశాలను పరిశీలించడం ద్వారా ఈ దేశంలో ఉంటున్న ముస్లిం కాదని, మన దేశంలో ఉంటున్న ముస్లింల భావన ఆయన అభిప్రాయానికి అనుగుణంగా లేదని చెప్పారు.

 అలాంటి వారికి ఇప్పటికీ పాకిస్తాన్ వెళ్ళలేకపోయామనే నిరాశ వారిలో ఇప్పటికీ ఉందన్నారు. ఎందుకంటే వారికి పాకిస్తాన్ స్వాతంత్య్ర లభిస్తుందని భావిస్తారనీ, భారతదేశంలో నేడు అందరికీ సమాన స్వేచ్ఛ, సమాన హక్కులు ఉన్నప్పటికీ, ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నందువల్ల వారు ఈ స్వేచ్ఛను అనుభవించరని విమర్శించారు. వారు హిందుస్థాన్‌ను కాకుండా పాకిస్థాన్‌ను కోరుకుంటున్నారన్నారు. ఇది స్వతంత్ర భారత దేశమని ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందన్నారు.

అదే సమయంలో అబ్దుల్ బారీ సిద్ధిఖీ ప్రకటనపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌లో వాతావరణం సరిగా లేకుంటే పాకిస్థాన్‌కు వెళ్లవచ్చని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అబ్దుల్ బారీ సిద్ధిఖీకి సూచించారు.

ఇంతకీ ఏం జరిగింది? 

గత వారం ఆర్జేడీ నేత, బీహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారతదేశంలో ముస్లింలపై వ్యతిరేకత ఉందని, వారు అభద్రతా భావంతో ఉన్నారని, భారతదేశంలోని వాతావరణం ముస్లింలు జీవించడానికి అనుకూలంగా లేదని ఆరోపించారు. ‘‘ దేశంలో నెలకొన్న వాతావరణాన్ని వివరించడానికి నేను వ్యక్తిగత ఉదాహరణను చెప్పాలనుకుంటున్నాను. నాకు హార్వర్డ్ (యూనివర్శిటీ)లో చదువుతున్న ఒక కొడుకు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుతున్న ఒక కుమార్తె ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగం చూసుకోవాలని, వీలైతే విదేశీ పౌరసత్వం కూడా తీసుకోవాలని వారికి చెప్పాను‘‘ అని తెలిపారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ, ఈ దేశంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఆయనకు లభిస్తున్న అన్ని రకాల సదుపాయాలను వదిలిపెట్టి, పాకిస్థాన్ వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు.

వివాదస్పద వ్యాఖ్యలపై క్లారిటీ

తాను ప్రసంగించిన కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారని, వారిలో చాలా మంది ఘాటుగా మాట్లాడారని, అయితే నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని సిద్ధిఖీ అన్నారు. దేశద్రోహిగా, చాలా మంది అక్రమార్కులను దేశభక్తులుగా పేర్కొంటారు. ఎందుకంటే వారు అధికార పార్టీకి అంకితమయ్యారు.

"నా మాటలు ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అందుకు చింతిస్తున్నాను, కానీ ఒక మార్పు కోసం, భయం, బాధతో జీవిస్తున్న వారి కోసం కొంత విచారం వ్యక్తం చేయడం మంచిది" అని సిద్ధిఖీ అన్నారు. "పఠాన్" సినిమా సందర్భంలో అయోధ్య సాధువు పరమహంస ఆచార్యకు సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సిద్ధిఖీ నేను మాట్లాడిన దాని గురించి ఎందుకు అంత హడావుడి, ఏడుపు అని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios