న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రీయా సూలే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాట్సప్ స్టేటస్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పార్టీ, కుటుంబం చీలిపోయాయి అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు.

సుప్రియా సూలే మేనబావ అజిత్ పవార్ శనివారం తెల్లవారు జామున డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. శివేసన, ఎన్సీపీ, కాంగ్రెసు కూటమి గురించి జరిగిన చర్చల్లో శరద్ పవార్ తో కలిసి ఆజిత్ పవార్ పాల్గొన్నారు. మూడు పార్టీల ఉమ్మడి సమావేశం ముగిసిన తర్వాత - ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారని సరద్ పవార్ ప్రకటించారు. 

Also Read:'మహా' మలుపు: ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్... ఎన్సీపీలో చీలిక?

ఎన్సీపీకి చెందిన మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతు తెలుపుతూ లేఖలు ఇచ్చారని బిజెపి చెబుతోంది. అయితే, అందులో నిజం లేదని శరద్ పవార్ అంటున్నారు. బిజెపికి మద్దతు తెలియజేయాలనేది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఎన్సీపికి సంబంధం లేదని ఆయన అన్నారు. 

శివసేనకు మద్దతు ఇస్తూ ఎమ్మెల్యేల సంతకాలతో సేకరించిన లేఖలను దుర్వినియోగం చేశారని ఎన్పీపి ేత నవాబ్ మాలిక్ అంటున్నారు. అజిత్ పవార్ తమ పార్టీని వెనక నుంచి పొడిచారని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు 

Also Read: పవార్ జి... మీరు గొప్పవారయ్యా: కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి

రాత్రి 9 గంటల వరకు ఆ మహాశయుడు తమతో కూర్చుకున్నాడని, చర్చల్లో పాల్గొన్నారని, అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడని, మాట్లాడుతున్నప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయాడని, ఫోన్ మీద అందుబాటులోకి రాలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.