Asianet News TeluguAsianet News Telugu

పవార్ జి... మీరు గొప్పవారయ్యా: కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి

మహారాష్ట్ర పరిణామాలను తొలుత ఫేక్ న్యూస్ గా భావించానని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. నేటి ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు.  

pawar ji..tussi great ho: abhishek manu singhvi on maharashtra government formation
Author
New Delhi, First Published Nov 23, 2019, 11:29 AM IST

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ బీజేపీ ఇచ్చిన షాక్‌‌తో ప్రత్యర్థి పార్టీల్లో తీవ్ర విస్మయం, విచారం వ్యక్తం అవుతోంది. ఉదయం నుంచి వడివడిగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ నేతలకు ఒక రకంగా ఊపిరాడకుండా చేస్తున్నాయి. 

మహారాష్ట్ర పరిణామాలను తొలుత ఫేక్ న్యూస్ గా భావించానని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. నేటి ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు.  

‘‘మహారాష్ట్ర గురించి నేను చదివింది నిజం కాదేమో. ఇది ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాను. నా మనసులో మాట చెప్పాలంటే మాత్రం... మా మూడు పార్టీల మధ్య చర్చలు మూడు రోజులకు మించి జరగాల్సింది కాదు. చర్చల్లో చాలా జాప్యం జరిగింది. మాకంటే వేగంగా పావులు కదిపిన వారికి ఛాన్స్ దక్కింది. పవార్ జీ... తుస్సీ గ్రేట్ హో(మీరు మహానుభావులు.. గొప్పవారు) ఇదే నిజమైతే నిజంగా ఆశ్చర్యమే..’’ అని రాసుకొచ్చారు. 

ఇకపోతే, సుస్థిరమైన పాలన అందిస్తామని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ చెప్పారు. ఖిచిడీ ప్రభుత్వాలు మహారాష్ట్రకు అవసరం లేదన్నారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు. 

ప్రజలు తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఆయన అన్నారు. మహారాష్ట్రకు సుస్థిరమైన ప్రభుత్వం అవసరమని, కిచిడీ ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. శివసేన ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుందని ఆయన చెప్పారు. 

మహారాష్ట్రలో రైతు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని, దాంతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి సహా కేబినెట్ పదవులన్నీ 50-50 ఫార్ములా ద్వారా పంచుకోవాల్సిందేనంటూ శివసేన డిమాండ్ చేయడం, అందుకు బీజేపీ అంగీకరించక పోవడంతో ప్రభుత్వ ఏర్పాటు నిలిచి పోయిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios