పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ప్రతి సంవత్సరం తనకు కుర్తాలు పంపుతారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కుర్తాలతోపాటు.. అప్పుడప్పుడు బెంగాలీ మిఠాయిలు కూడా పంపుతుంటారని చెప్పారు. బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్... ప్రధాని నరేంద్రమోదీని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో మోదీ తన గురించి పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. మోదీ ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడం సర్వత్రా ఆసక్తి కలిగించింది.

ప్రతిపక్షాలల్లో తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత ఆజాద్ తనకు ఆప్తమిత్రుడని చెప్పుకొచ్చారు. తనతో సమావేశాల్లో ఎవరూ మొబైల్ ఫోన్లు వాడరని మోదీ అన్నారు. అధికారులందరితో ఓ స్నేహితుడిలా ఉంటానని చెప్పారు. ఇప్పటికీ తనకు వాళ్ల అమ్మ డబ్బులు ఇస్తుందని చెప్పారు.

స్కూల్ సమయంలో బ్యాంక్ ఖాతా తెరిచినా.. అందులో డబ్బులు వేయలేదని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు బ్యాంకు ఖాతా కూడా లేదని చెప్పారు. గుజరాత్‌ సీఎంగా పనిచేసిప్పుడు తన బ్యాంక్‌ ఖాతాలో 30 లక్షలు ఉందని.. అందులో రూ.21 లక్షలు తన స్టాఫ్‌కు ఇచ్చేశానన్నారు. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ వెళ్లి అమ్మను కలిసి వస్తానని మోదీ తెలిపారు.

related news

ప్రధానిని అవుతానని అనుకోలేదు.. మోదీ