బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యరాయ్ తో విడిపోవాలని నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం పట్నా న్యాయస్థానంలో తేజ్ ప్రతాప్ యాదవ్.. విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు.

కాగా.. ఈ విషయంపై తాజాగా తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించాడు. విడాకులు తీసుకోవడానికి గల అసలు కారణాన్ని ఆయన మీడియాకు వివరించారు.
ఐశ్వర్యతో వివాహానంతరం తాను సంతోషంగా ఉండలేకపోయానని తేజ్ ప్రతాప్ తెలిపారు. అందుకే విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు చెప్పారు. సంతోషంగా లేకుండా కలిసి ఉండటంలో అర్థం లేదని అందుకే విడాకులే సరైన మార్గమని అనిపించిందన్నారు. తాను ఉత్తర ధ్రువం అయితే.. తన భార్య దక్షిణ ధ్రువమని.. వారిద్దరికి సెట్ అవ్వదని ఆయన తెలిపారు. 

కాగా.. తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్ ల వివాహం జరిగి కేవలం 6నెలలు మాత్రమే అవుతుండటం గమనార్హం. మే 12న వీరి వివాహం అంగరంగ వైభవంగా అతిరథమహారదుల సమక్షంలో జరిగింది. 

more news

ఐశ్వర్యా రాయ్ విడాకులు.. మనస్పర్థలే కారణమా..?