Asianet News TeluguAsianet News Telugu

నేను విరాట్ కోహ్లి అభిమానిని: కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు

తాను క్రికెటర్ విరాట్ కోహ్లి అభిమానిని అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. 

'I'm a fan of Virat Kohli; to me he is distilled competitiveness': Jaishankar lauds iconic cricketer lns
Author
First Published Dec 17, 2023, 5:17 PM IST

న్యూఢిల్లీ: తాను భారత జట్టు క్రికెట్ జట్టు సభ్యుడు విరాట్ కోహ్లి  అభిమానిని అని  కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.ఇటీవల జరిగిన రోటరీ రైస్ ఇంటరాక్షన్ విత్ డెలిగేట్స్  ఈవెంట్ లో  విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్  ఈ విషయాన్ని తెలిపారు. 

విరాట్ కోహ్లి కెరీర్ ను నిర్వహించే లక్షణాల్లో ఒకటి పరాజయాల నుండి తిరిగి పుంజుకోవడమని ఆయన  చెప్పారు.  ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగే తత్వం కోహ్లిదని ఆయన పేర్కొన్నారు.తాను కూడ విరాట్ కోహ్లి అభిమానినని  ఆయన చెప్పారు.  తాను ఎక్కువగా విరాట్ కోహ్లిని ఆరాధిస్తానని  జైశంకర్  తెలిపారు.  తన పనివిధానంలో రాజకీయాలైనా, దౌత్యమైనా చాలా పోటీతత్వంతో కూడిన పనిగా జైశంకర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  చైనాతో పాటు పొరుగు దేశాలతో  భారతదేశ సంబంధాల గురించి కూడ జైశంకర్ మాట్లాడారు.  కొన్ని పొరుగు దేశాలతో సంబంధాలు సమస్యగా ఉన్నాయని తనకు తెలుసునన్నారు.  అయితే పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలు వాస్తవానికి మినహాయింపు అని సూచిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి జైశంకర్ చెప్పారు. ఇప్పటికే పొరుగువారిలో ప్రతి ఒక్కరికి భారతదేశం గురించి చాలా మంచి అనుభవాలున్నాయన్నారు. ఇవాళ మన పొరుగువారిలో ప్రతి ఒక్కరికీ భారతదేశం గురించి చాలా మంచి అనుభవాలున్నాయన్నారు. పొరుగువారితో  విభేదాలు ఉండడం సహజమన్నారు.  

చైనాతో తమ సంబంధం ఈనాటి కంటే మెరుగ్గా ఉండాలని తాము కచ్చితంగా కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ చెప్పారు. అయితే గత మూడేళ్లలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారినట్లైతే అది ఇండియా వల్ల కాదన్నారు. సరిహద్దుల్లో  ఒప్పందాలను పాటించకూడదని వారు ఎంచుకున్నారని చైనాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 


కెనడా గురించి డాక్టర్ జైశంకర్ స్పందించారు.  భారతదేశం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు.  ఇదే విషయాన్ని తాము కొనసాగిస్తున్నట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. కెనడా మాత్రమే కాదు ఏదైనా దేశంలో తమకు ఆందోళనకు సంబంధించిన సమాచారం అందిస్తే దాని గురించి చర్చించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios