తాజ్ మహల్ ని కూలగొడతారా..?

"Either We'll Shut Down Taj Mahal Or...": Supreme Court Slams Centre
Highlights

తాజ్‌ను మూసివేయమంటారా లేదా మీరు ధ్వంసం చేస్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. లేదంటే..ఆ కట్టడాన్ని సంరక్షించుకోవడానికి కావాల్సిన పునర్ నిర్మాణ పనులు చేపట్టాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ప్రపంచ ఏడువింతల్లో ఒకటైన తాజ్ మహల్ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న యూపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్ సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని కోర్టు ఆగ్రహించింది. రోజు రోజుకూ రంగుమారుతున్న పాలరాతి కట్టడాన్ని కాపాడాకోవాలంటూ దాఖలైన పిటీషన్‌పై స్పందిస్తూ కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది

తాజ్‌ను మూసివేయమంటారా లేదా మీరు ధ్వంసం చేస్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. లేదంటే..ఆ కట్టడాన్ని సంరక్షించుకోవడానికి కావాల్సిన పునర్ నిర్మాణ పనులు చేపట్టాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈఫిల్ టవర్ కన్నా తాజ్‌మహల్ అందమైనదని, ఓ రకంగా ఫారెన్ ఎక్స్‌చేంజ్ సమస్యను తాజ్ తీర్చేదని న్యాయమూర్తులు తమ తీర్పులో వ్యాఖ్యానించారు. 

తాజ్ నిర్వహణ సరిగా లేదని వేసిన పిటీషన్‌లో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఈఫిల్ టవర్‌ను చూసేందుకు 80 లక్షల మంది వెళ్తుంటారని, అదో టీవీ టవర్‌గా కనిపిస్తుందని, కానీ మన తాజ్ మరింత అందమైందని, దాన్ని సరిగా చూసుకుంటే విదేశీ కరెన్సీ సమస్య ఉండేది కాదు అని జడ్జిలు అభిప్రాయపడ్డారు. 

loader