Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict

శుక్రవారం రాత్రి నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో యువతతో పాటు మేధావులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict చోటు సంపాదించుకుంది. 

#Ayodhya Verdict hashtag placed Top Twitter Trend in Worldwide
Author
New Delhi, First Published Nov 9, 2019, 3:41 PM IST

చారిత్రక అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. రోడ్డుపై ఏ నలుగురు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి సరే సరి.

శుక్రవారం రాత్రి నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో యువతతో పాటు మేధావులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict చోటు సంపాదించుకుంది.

మధ్యాహ్నం 2.30 నాటికి ఈ హ్యాష్‌ట్యాగ్‌పై భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,50,000 ట్వీట్లు పోస్టయ్యాయి. భారత్‌లో #BabriMasjid, #AyodhyaJudgement మరియు #RamJanmabhoomi హ్యాష్ ట్యాగ్లు బాగా ట్రెండవుతున్నాయి.

Also Read:ayodhya verdict: అయోధ్య తీర్పు.. బాబ్రీ యాక్షన్ కమిటీ అసంతృప్తి

అలాగే #SupremeCourt కూడా ట్రెండ్స్‌లో స్థానం సంపాదించింది. సర్వోన్నత న్యాయస్థానంపై 2,00,00 ట్వీట్లు షేరయ్యాయి. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగొయ్ #RanjanGogoi అన్న హ్యాష్ ట్యాగ్ కూడా నెటిజన్లు బాగా ఉపయోగించారు.

అయోధ్య తీర్పు దేశప్రజల మనోభావాలతో ముడిపడివున్న అంశం కావడంతో పాటు రెండు ప్రధాన మతాలు ముడిపడివుండటంతో నెటిజన్లు శాంతిని, సమానత్వాన్ని చూపారు. #hindumuslimbhaibhai హ్యాష్‌ట్యాగ్ ద్వారా తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు.

హిందువులు, ముస్లింలు సోదరులేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీర్పు గురించి తనకు అనవసరమని.. తాను సోదరభావాన్ని పంచుతానంటూ ఎక్కువ మంది ట్వీట్ చేశారు. 

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Also Read:ayodhya verdict: తుది తీర్పు వెలువరించిన జడ్జిల నేపధ్యం ఇదే

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

పురావస్తు పరిశోధనలు చూస్తే 12వ, శతాబ్దంలోనే ప్రార్ధనా స్థలం ఉందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయితే అది దేవాలయం అని చెప్పేందుకు కూడ ఆధారాలు లేవని కూడ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

దేవాలయాన్ని ధ్వంసం చేశారని చెప్పడానికి పురావస్తు ఆధారాల్లేవని సుప్రీంకోర్టు చెప్పింది. 12-16 శతాబ్దాల మధ్య అక్కడేముందో చెప్పేందుకు పురావస్తు శాఖ వద్ద ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.అయోధ్యను రాముడి జన్మభూమిగా హిందూవులు భావిస్తున్నారు. అయితే ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios