రజినీకాంత్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువయ్యాయి. ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ ఈ ఊహగానాలకు తెరదించారు.


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్  రజినీకాంత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై బలవంతంగా కాషాయ రంగు పులమాలని బీజేపీ ప్రయత్నిస్తుందంటూ 
కమలం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి వలకు నేను చిక్కాను అంటూ బీజీపీకీ చురకులు అంటించారు. జీజేపీ నుంచి తన ఎవరు సప్రదించలేదని త్వరలో తమిళనాడులో జరిగే స్థానిక సంస్థలలో తాము పోటీ చేయడం లేదని  తెలిపారు. 

బీజేపీతోనే తేల్చుకోండి.. మేము ప్రతిపక్షంగానే ఉంటాం: శివసేనకు పవార్ సూచన

అయితే రజినీకాంత్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువయ్యాయి. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ ఈ ఊహగానాలకు తెరదించారు.విగ్రహా అవిష్కరణ అనంతరం  ఏర్చాటు  చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన  రజనీ ఈ విషయం స్పందించారు. 

భారతీయ జనాతా పార్టీ అడే రాజకీయ నాటకంలో "తిరువల్లూవర్ చిక్కుకోరు నేను చిక్కుకోను" అన్నారు. బీజేపీ ట్రాప్‌లో తాను ఎప్పటికీ పడనన్నారు. అలాగే తిరువళ్లవర్‌ విగ్రహ వివాదంపై కూడా ఆయన స్పందించారు. " నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది. నేను వారి ట్రాప్‌లో పడను,బీజేపీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయోద్దు. అనవసర వివాదానికి తెరలేపోదంటూ ఘాటుగా  స్పందించారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!
తమిళనాడులో ప్రస్తుతం తిరువళ్లువర్ చూట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. తంజావూరులో తిరువళ్లువర్ విగ్రహానికి  హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయ వస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు చేశారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. వివిధ పార్టీలు ఈ విషయంపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగాయి.


తాజాగా ఈ సంఘటనపై  రజినీ చేసిన వ్యాఖ్యలు  తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. ఆధ్యాత్మిక  భావనాలు ఉన్న రజనీ బీజేపీలో చేరుతారనే ప్రచారం పెద్దయెత్హునా జరిగింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అవన్ని పుకార్లేనని అర్ధమవుతున్నాయి.