తెలంగాణ హై కోర్టు తెలంగాణ సర్కార్ తీసుకున్న రూట్ల ప్రయివేటీకరణపై స్పందించింది. 5100 రూట్లను ఇటీవల ప్రైవేటీకరిస్తున్నట్టు కెసిఆర్ సర్కార్ కాబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాజీ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు నిన్న హై కోర్టులో పిల్ దాఖలు చేసారు. కోర్టు నేడు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. 

ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10.30 గంటలకు హై కోర్ట్ ఈ విషయమై వాదనలు వినడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా కోర్టు తదుపరి విచారణను 11వ తేదికి వాయిదా వేసింది. అప్పటిలోగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయానికి సంబంధించిన కాబినెట్ ప్రొసీడింగ్స్ ని సమర్పించాలని ఆదేశించింది. 

అంతేకాకుండా తదుపరి విచారణ జరిగే 11వ తేదీ వరకు ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాల జోలికి వెళ్లోద్దని ఆదేశించింది. అంతే కాకుండా ఆర్టీసీని కూడా ఈలోపల కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. 

నిన్న హై కోర్టులో ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు వాదనలు విన్నది.  ఆర్టీసీ విభజన అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఏపీ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. 

గురువారం నాడు ఏపీ సీఎం జగన్ ఆర్టీసీపై జరిగే సమయంలో తెలంగాణలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని కూడ ఆలోచనలో పడేసినట్టుగా సమాచారం.

Also read:ఆ ఉద్దేశం ఉందా, లేదా: ఆర్టీసీ సమ్మె కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

 ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్  అంగీకరించారు. ఇదే ప్రధానమైన  డిమాండ్‌తో తెలంగాణలో  ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Also read:మళ్లీ తప్పుడు లెక్కలేనా: అధికారులపై హైకోర్టు గరం, రామకృష్ణారావు క్షమాపణ

ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడ వాటా ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా రాస్ట్ర ప్రభుత్వానిది. 2014 ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014ను తెచ్చింది అప్పటి కేంద్రం.  

also readRTC Strike: ఆర్టీసీపై కీలక ప్రకటన... సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయమిదేనా..?

ఉమ్మడి ఏపీ రాష్ట్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విభజన చేయడంతో  రాష్ట్రంలోని 9,10 వ షెడ్యూల్ సంస్థలతో పాటు ఇతర  సంస్థల విభజనకు కూడ కొన్ని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కొన్ని సంస్థల విభజన పూర్తి కాలేదు. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనతో పాటు, ఉద్యోగుల విభజన తదితర అంశాలు రెండు రాష్ట్రాల మధ్య కీలకంగా మారాయి. ఈ  రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు ప్రయత్నాలు చేస్తున్నారు.

also read:కేసీఆర్ లక్ష్యం అదే.... మిలియన్ మార్చ్ కు మా మద్దతు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్

ఆర్టీసీ సంస్థ 9వ షెడ్యూల్‌లో ఉంది. రాష్ట్ర విభజనతో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ఏపీఎస్ఆర్టీసీగా, తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పిలుస్తున్నాయి. అయితే ఏపీఎస్ఆర్టీసీ ఇంకా విభజన పూర్తి కాలేదని కేంద్రం గురువారం నాడు స్పష్టత ఇచ్చింది.

ఆర్టీసీ సమ్మె సందర్భంగా తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా  కేంద్రం తరపున విచారణకు హాజరైన లాయర్ రాజేశ్వర్ రావు ఆర్టీసీ విభజనకు సంబంధించి కేంద్రం వాదనను విన్పించారు.

ఆర్టీసీలో కేంద్రం వాటా 33 శాతం ఉందని చెప్పారు. ఆర్టీసీ విభజనకు సంబంధించి కేంద్రం నుండి ఎలాంటి అనుమతులు లేవన్నారు.ఆర్టీసీ విభజన జరిగితే ఏపీఎస్ఆర్టీసీకి కానీ, తెలంగాణ ఆర్టీసీకి గానీ 33 శాతం నిధులు  సగానికి సగం కానీ,  మొత్తం నిధులు కానీ ఆటోమెటిక్ గా బదిలీ కావని  కేంద్రం తరపున లాయర్ రాజేశ్వరరావు కోర్టుకు వివరించారు.

ఆర్టీసీ విభజన జరగలేదని ఈ సమస్య ఇంకా పెండింగ్‌లో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ,  అడ్వకేట్ జనరల్ కూడ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఆర్టీసీ విభజన జరగని సమయంలో కొత్త ఆర్టీసీని ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

తెలంగాణ హైకోర్టులో కేంద్రం విన్పించిన వాదనలతో ఏపీ ప్రభుత్వంలో చర్చ మొదలైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చాడు.ఈ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి రంగం సిద్దం చేశారు.

అయితే ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్రం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ సర్కార్‌ను ఆలోచనలో పడేశాయి. తెలంగాణలో చోటు చేసుకొన్న పరిణామాలను ఏపీ సర్కార్ కూడ నిశితంగా గమనిస్తోంది. 

ఏపీఎస్ఆర్టీసీ విభజన జరగకపోతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని ప్రక్రియను మొదలు పెడితే సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతాయా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఏం చేయాలనే విషయమై కూడ ప్రభుత్వం ఆలోచనలో పడినట్టుగా సమాచారం. గురువారం నాడు ఏపీ సీఎం జగన్ సమక్షంలోఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఈ విషయాలపై చర్చిస్తారు.

ఆర్టీసీ విభజన విషయంలో కేంద్రం అడ్డుచెబితే విలీనం సమస్య మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదు. 9వ షెడ్యూల్‌  సంస్థల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు దాటుతున్నా రెండు రాష్ట్రాల మధ్య సంస్థల విభజన సమస్య ఇంకా పూర్తి కాలేదు.ఆర్టీసీ విభజన పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఆర్టీసీ విభజన విషయంలో కేంద్రం ఏ రకమైన వైఖరి తీసుకొంటుందోననే చర్చ ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో నెలకొంది. ఆర్టీసీ విషయంలో ఏ కీలక నిర్ణయం తీసుకొన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి . ఇదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి  ఇటీవల పదే పదే ప్రకటించారు.