పీరియడ్స్ లో వచ్చే రక్తంతో ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..?

women draw baby painting with periods blood
Highlights

పీరియడ్స్ మాతృత్వానికి కారణం అనే విషయాన్ని తన పెయింటింగ్ ద్వారా మరోసారి చెప్పింది. ఆమె అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికీ మన సమాజంలో పీరియడ్స్ సమయంలో ఆడవారికి ఆంక్షలు ఉన్నాయి. 

ప్రతినెలా అమ్మాయిలకు పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో అమ్మాయిలు చాలా నొప్పిని భర్తిస్తూ ఉంటారు. చాలా ఒత్తిడికి గురౌతూ ఉంటారు. కానీ ఆ పీరియడ్స్ కారణంగానే ఏ అమ్మాయి అయినా.. తల్లిగా మారుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇదే విషయాన్ని ఓ యువతి వినూత్నంగా అందరికీ మరోసారి తెలియజేసింది.

పీరియడ్స్ రక్తంతో పెయింటింగ్ వేసింది. అది కూడా ఏదో ఒక పెయింటింగ్ కాదు.. పిండాన్ని. అమ్మ కడుపులో బిడ్డ ఎలా తయారౌతుందో.. ఆ చిత్రాన్ని వేసింది. పీరియడ్స్ మాతృత్వానికి కారణం అనే విషయాన్ని తన పెయింటింగ్ ద్వారా మరోసారి చెప్పింది. ఆమె అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికీ మన సమాజంలో పీరియడ్స్ సమయంలో ఆడవారికి ఆంక్షలు ఉన్నాయి. ఆ సమయంలో ఏదీ చేయకూడదంటూ ఆంక్షలు వేస్తుంటారు. అయితే.. పీరియడ్స్ రావడం నేరం కాదు.. అవి మరో బిడ్డకు ప్రతిరూపం ఇవ్వడానికి కారణం అదే అనే విషయాన్ని ఆమె తన పెయింటింగ్ ద్వారా తెలియజేశారు.

వృత్తి పరంగా ఆమె పెయింటర్ కావడంతో చిత్రాన్ని కూడా అంతే అద్భుతంగా వేశారు. మొదట ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత మెచ్చుకున్నారు.  కాగా.. ఈ పెయింటింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆమె పెయింటింగ్ పై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

loader