అబ్బాయిలూ జాగ్రత్త.. అమ్మాయిల మేకప్ చూసి మోసపోకండి

Woman transforms into a completely different person after she tapes her cheeks and wears a fake nose
Highlights

వీడియోను చూసిన వారంతా ఇందులో ఉన్నది ఒకే అమ్మాయా? అని ఆశ్చర్యపోతున్నారు. 

అందంగా ఉండటానికి అమ్మాయిలు మేకప్ వేసుకుంటారని అందరికీ తెలుసు. కానీ.. మేకప్ కారణంగా ఏకంగా రూపు  రేఖలు మారిపోయి.. ఎంత అందంగా తయారౌతారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. 

చైనాకు చెందిన కి హువావా తన మేకప్‌ వీడియోతో ఒక్కరోజులోనే సోషల్‌మీడియాలో సెన్సేషన్‌ అయ్యింది. ఫౌండేషన్‌, లెన్సెస్‌, లిప్‌స్టిక్‌ వంటివాటితో ప్రొస్థటిక్‌ మేకప్‌ వేసుకుని హువావా పూర్తిగా మారిపోయింది. ఈ వీడియోలో ఆమె మేకప్‌ వేసుకోవడం, తొలగించడం కూడా ఉంది. హువావా మేకప్‌ వీడియో ముందు చైనీస్‌ వీడియో ప్లాట్‌ఫాం యుకులో విడుదలైంది. ఆ తర్వాత 9గ్యాగ్ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. శుక్రవారం ఈ వీడియోను పోస్టు చేయగా.. ఇప్పటికే 20లక్షల మందికి పైగా చూసేశారు. వేల కొద్ది లైక్‌లు, షేర్‌లు చేశారు.

వీడియోను చూసిన వారంతా ఇందులో ఉన్నది ఒకే అమ్మాయా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఈ వీడియో చూశాక.. అమ్మాయిలు మేకప్ తో అబ్బాయిలను చాలా సులభంగా మోసం చేయవచ్చు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అందుకే మేకప్ చూసి మోసపోకుండి.. మేకప్ లేకుండా అసలు అమ్మాయిలను చూడలేమంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

loader