ఆ కలల్లో చాలా మందికి చాలా వస్తూ ఉంటాయి. అయితే ఆ కలల్లో మనకు కొన్ని గుర్తులు వస్తూ ఉంటాయి. ఆ గుర్తుల అర్థం ఏంటో ఓసారి చూద్దాం...
నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సహజం. అయితే... ఆ కలల్లో చాలా మందికి చాలా వస్తూ ఉంటాయి. అయితే ఆ కలల్లో మనకు కొన్ని గుర్తులు వస్తూ ఉంటాయి. ఆ గుర్తుల అర్థం ఏంటో ఓసారి చూద్దాం...
1.చైనీస్ ఫ్యాన్..
మీ కలల్లోకి చైనీస్ ఫ్యాన్ వస్తోంది అంటే.. మీరు ఏదైనా గొడవలో తలదూర్చబోతున్నారు అని అర్థమట. లేదంటే... మీరు ఏదైనా గొడవ గురించి భయపడుతూ ఉన్నారని అర్థమట.
2.చేతులు..
మీ కల్లోకి చేతులు కనపడ్డాయి అంటే.. సమస్య నుండి బయటపడటానికి మీరు కొంత కష్టాన్ని ఎదుర్కొంటున్నారని దీని అర్థం.
3.మంచు..
మీ కలలోకి మంచు కానీ.. మంచు ప్రదేశాలు కానీ వస్తున్నాయి అంటే.. మీరు ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే ఎవరైనా వచ్చి సహాయం చేసే అకవాశం ఉందని అర్థమట.
4.కీ..
కలలోకి ఏదైనా తాళం చెవి వస్తోంది అంటే.. మీరు ఎవరికైనా ఏదైనా సీక్రెట్ చెప్పాల్సి రావడం లేదంటే.. ఏదైనా సమస్యకు సమాధానం చెప్పాల్సి వస్తోందని అర్థమట.
5.తాళం..
మీ కలలోకి తాళం వస్తే... అది మీ భద్రత, ఫ్రస్టేషన్ కి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.
6.సూర్యాస్తమం..
మీ కలలోకి సూర్యాస్తమం కనపడుతోంది అంటే... మీరు మీ ఆస్తులను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం.
7.జూ...
మీ కలలోకి జూ( జంతు ప్రదర్శన శాల) కనుక వచ్చింది అంటే.. మీరు జీవితంలో చాలా కన్ఫ్యూజన్ తో ఉన్నారని అర్థమట.
8.సూది, దారం..
సూది, దారం మీ కలలోకి వస్తున్నాయి అంటే... మీ కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉందట.
9.జైలు..
మీరు మిమ్మల్ని జైలులో ఉన్నట్లు చూసినా.. అలాంటి కలలు వచ్చినా.. మీరు జీవితంలో చాలా ఫ్రస్టేషన్ తో ఉన్నారని అర్థమట.
