వాటర్ బాటిల్‍ని ఈజీగా క్లీన్ చేేసే అద్భుతమైన చిట్కాలు!
life Mar 07 2026
Author: Kavitha G Image Credits:pexels
Telugu
వాటర్ బాటిల్ క్లీనింగ్
వాటర్ బాటిల్‌ను ఎన్నిసార్లు కడిగినా వాసన వస్తుంటుంది. బాక్టీరియా, తేమ, సరిగ్గా శుభ్రం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం.
Image credits: instagram And AI Image
Telugu
సింపుల్ క్లీనింగ్ ట్రిక్స్
కొన్ని సింపుల్ క్లీనింగ్ ట్రిక్స్‌తో వాటర్ బాటిల్‌ను శుభ్రంగా, వాసన రాకుండా చేయవచ్చు.
Image credits: instagram And AI Image
Telugu
బేకింగ్ సోడా
బాటిల్‌లో 1 చెంచా బేకింగ్ సోడా వేసి, గోరువెచ్చని నీటితో నింపాలి. బాటిల్‌ను బాగా షేక్ చేసి, 20–30 నిమిషాల తర్వాత బ్రెష్‌తో శుభ్రంగా కడిగేయాలి. దీంతో వాసన, మరకలు రెండూ పోతాయి.
వెనిగర్ దుర్వాసన, బాక్టీరియాను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బాటిల్‌లో సగం వరకు నీళ్లు నింపి, 2–3 చెంచాల వెనిగర్ కలపాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయం శుభ్రంగా కడగాలి.
Image credits: instagram And AI Image
Telugu
ఉప్పు, ఐస్
బాటిల్‌లో కొద్దిగా దొడ్డు ఉప్పు, కొన్ని ఐస్ ముక్కలు వేయాలి. బాటిల్‌ను బాగా షేక్ చేసి, మంచి నీటితో కడగాలి. బాటిల్ లోపల పేరుకుపోయిన మరకలు తొలగిపోతాయి.
Image credits: instagram And AI Image
Telugu
బ్రెష్‌తో క్లీనింగ్
చేతితో బాటిల్ లోపల సరిగ్గా శుభ్రం చేయలేం. పొడవాటి హ్యాండిల్ ఉన్న బాటిల్ బ్రెష్ వాడాలి. కడిగాక బాటిల్ మూత పెట్టకుండా కాసేపు ఆరబెట్టాలి.