Asianet News TeluguAsianet News Telugu

పొట్ట దగ్గర కొవ్వును కరిగించే ఫుడ్స్ ఇవే..


నెలరోజుల్లో ఫలితం కనపడుతుంది అంటున్న నిపుణులు

these are the best foods to reduce belly fat

బెల్లీ ఫ్యాట్.. చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. ఎన్ని వ్యాయామాలు చేసినా కూడా ఫలితం అంతంత మాత్రమే. ఏ కొద్దిగ జంక్ ఫుడ్ తిన్నా చాలు.. ఆ కొవ్వు అంతా.. పొట్ట దగ్గరికే చేరిపోతూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. ఎందుకు లేదో.. కేవలం కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వును కరిగించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి లుక్కేద్దామా..

1. వాము

అధిక బరువును తగ్గించుకునేందుకు వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక లీటర్ నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని చల్లార్చి రోజులో కొద్ది కొద్దిగా తాగుతుండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.

2. పెసలు

శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించి అధిక బరువును తగ్గించడంలో పెసలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిల్లో విటమిన్ ఎ, బి, సి, ఇ లతోపాటు అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి. నిత్యం ఒక కప్పు పెసలను ఉడకబెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.

3. గోధుమ రవ్వ ఉప్మా

గోధుమ రవ్వతో తయారు చేసిన ఉప్మాను రోజులో ఏదో ఒక పూట తినాలి. నిత్యం తినే ఆహారానికి బదులుగా దీన్ని తింటే చక్కని ఫలితం ఉంటుంది. అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు.

4. సబ్జా విత్తనాలు

సబ్జా గింజల్లో విటమిన్ ఎ, ఇ, కె, బి లు, డైటరీ ఫైబర్, కాపర్, క్యాల్షియం, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. శరీరంలో ఉన్న విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. అధిక బరువును, పొట్టను తగ్గిస్తాయి.

ఈ ఫుడ్స్ ని కనుక మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే.. బెల్లీ ఫ్యాట్ ని సులభంగా కరిగించవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios