Asianet News TeluguAsianet News Telugu

Blood in Urine: మూత్రం రంగు మారితే ఇంత డేంజరా?

Blood in Urine: మూత్రం చాలు మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. అందుకే వైద్యులు యూరిన్ టెస్ట్ ను చేయించమంటారు. అయితే కొంతమందికి మూత్రంలో రక్తం కూకడా వస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావొచ్చు. 
 

the meaning behind the color of urine
Author
Hyderabad, First Published May 9, 2022, 10:40 AM IST

Blood in Urine: మన మూత్రం రంగు మన ఆరోగ్యాన్ని తెలిసే సూచిక లాంటిది. అందులో అప్పట్లో డాక్టర్లు ‘మూత్రం రంగు ఏ రంగులో వస్తుంది’అని అడిగే వారు. ఇప్పుడు వివిధ యూరోలాజికల్ పరీక్షలు ఉన్నాయి. అయితే ఈ మూత్రం ద్వారానే ఎన్నో వ్యాధులను గుర్తించవచ్చు. 

వివిధ కారణాల వల్ల మూత్రం లేత  పసుపు రంగే లేదా వేరే రంగులోకి మారుతుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగానికి కూడా కారణం కావొచ్చు. అయితే మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కానీ మరుగుదొడ్డికి సంబంధించిన సమస్యల గురించి చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు. కానీ ఇలా చెప్పకపోవడం వల్ల ప్రాణాల మీదికి రావొచ్చు. ఎందుకంటే మీ సమస్యలను ఇతరులకు గానీ, డాక్టర్లకు గానీ చెప్పినప్పుడే అసలు సమస్య ఏంటన్నది బయటపడుతుంది. 

మూత్రం రంగు మారడం అస్సలు మంచిది కాదు. కొందరికైతే కొన్ని సమయాల్లో మూత్రంలో రక్తం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే మూత్రం లేత ఎరుపు రంగులోకి మారుతుంది. దీన్నిగుర్తించకపోతే మాత్రం మీ ప్రాణాలమీదికే రావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. యూకేలోని ప్రముఖ డాక్టర్ మిరియం స్టెప్పర్డ్ ప్రకారం.. కొంతమందికి మూత్రంలో రక్తం కూడా వస్తుంది.

డాక్టర్ మిరియం స్టెప్పార్డ్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో.. మూత్రం నుండి రక్తం ఎందుకు బయటకు వెళుతుందో వివరించాడు. ఒక సారి అతని స్నేహితుడు భయంగా అతన్ని పిలిచి.. "మూత్రం ఎర్రగా కనిపిస్తోంది. ఎందుకు?  ఏదైనా వ్యాధి అయి ఉంటుందా?" అని అడిగాడు. నేను ఆహారం గురించి  అడిగాడు. దానికి అతను ముందు రోజు బీట్ రూట్ తిన్నానని నాకు చెప్పాడు. బీట్ రూట్ తినడం ద్వారా కూడా కొంతమంది మూత్రం గులాబీ రంగులోకి మారుతుంది. అప్పుడు మూత్రంలో రక్తం ఉన్నట్లుగా అనిపిస్తుంది. బీట్ రూట్ ముదురు గులాబి రంగులో ఉంటుంది. బీట్ రూట్ ను ఏదైనా పదార్థంలో కలిపినప్పుడల్లా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ మేరకు బీట్ రూట్ రంగుకు దాని స్వంత గుర్తింపు ఉంది. అలాంటి బీట్ రూట్ మూత్రం యొక్క రంగును కూడా మారుస్తుందని డాక్టర్ చెప్పారు. 

మూత్రాశయ క్యాన్సర్ రోగుల మూత్రంలో రక్తం రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్నే హెమటూరియా అంటారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్ కు చెందిన అనికా మదన్ ప్రకారం..మూత్రాశయ క్యాన్సర్ ఉన్న 80 శాతం మంది రోగుల మూత్రంలో రక్తస్రావంలో సమస్యలు ఉన్నట్టు తేలింది. 

అయితే మూత్రం ఎర్రగా మారడం.. క్యాన్సర్ కు సంబంధించింది కూడా కాకపోవచ్చు. దీనికి అనేక ఇతర కారణాలు ఉండొచ్చు. ప్రోస్టేట్ పెద్దదిగా ఉన్నప్పుడు మూత్రాశయం, మూత్రశాయం యొక్క సంక్రమణ ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం కనిపిస్తుంది. 

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు కూడా మూత్రం నుంచి రక్తం బయటకు వెళుతుంది. ఇది సర్వసాధారణం. ఎక్కువ సేపు పరుగెత్తడం, ఈతకొడ్డటం మొదలైన కార్యకలాపాల వల్ల మూత్రంలోకి రక్తం ప్రవేశిస్తుంది. 

అలాగే కొన్ని మందుల వల్ల మూత్రంలో రక్తం రావడానికి కారణమవుతుంది. బ్లాక్ బెర్రీలు, కొన్ని ఎరుపు ఆహార పదార్థాలు కూడా మూత్రం రంగును ఎరుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios