Asianet News TeluguAsianet News Telugu

నొప్పి నివారణకు.. సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజసిద్దమైన పెయిన్ కిల్లర్స్ ఇవి..

యాక్సిడెంట్లు, తీవ్రమైన ఆరోగ్యకారణాలతో వచ్చే నొప్పులకు డాక్టర్లే పెయిన్ కిల్లర్లు రాస్తారు. అలా కాకుండా తలనొప్పి, కడుపునొప్పి, పీరియడ్స్ పెయిన్.. కాళ్లనొప్పులు లాంటి వాటికి చాలామంది సొంత వైద్యాన్ని ప్రిఫర్ చేస్తారు. ఏదో ఓ పెయిన్ కిల్లర్ వేసుకుని నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందుతుంటారు. 

ten natural painkillers
Author
Hyderabad, First Published Oct 16, 2021, 11:48 AM IST

పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు ఇవి మన జీవితాల్లో భాగం అయిపోయాయి. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వేగం, ఒత్తిడులు.. తలనొప్పితో మొదలుపెట్టి రకరకాల నొప్పులను అనుభవంలోకి తెస్తున్నాయి. దీంతో అంతిమంగా నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ వైపు మొగ్గు చూపుతాం. 

ten natural painkillers

యాక్సిడెంట్లు, తీవ్రమైన ఆరోగ్యకారణాలతో వచ్చే నొప్పులకు డాక్టర్లే పెయిన్ కిల్లర్లు రాస్తారు. అలా కాకుండా తలనొప్పి, కడుపునొప్పి, పీరియడ్స్ పెయిన్.. కాళ్లనొప్పులు లాంటి వాటికి చాలామంది సొంత వైద్యాన్ని ప్రిఫర్ చేస్తారు. ఏదో ఓ పెయిన్ కిల్లర్ వేసుకుని నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందుతుంటారు. 

అయితే ఇలా pain killersను ఎక్కువగా వాడడం వల్ల దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. నొప్పి నుంచి ఉపశమనం ఎలా మరి? దీనికోసం వేరే ఏదైనా మార్గాలున్నాయా? నొప్పిని రాకుండా ఆపలేం కదా? ఇలాంటి అనుమానాలు సహజమే అయితే.. దీనికోసం natural pain killers ను వాడడం మంచిది.

ఎస్సెన్షియల్ ఆయిల్స్, హెర్బ్స్, ప్రత్యామ్నాయ థెరపీలను యేళ్లుగా సహజ సిద్దమైన నొప్పి నివారణ ప్రక్రియలో వాడుతున్నారు. అలాంటి ఓ పది సహజ సిద్దమైన నొప్పి నివారణిలు ఏంటో చూద్దాం. 

అన్నింటికంటే సులువైన నొప్పి నివారణ మార్గం వేడి నీటి స్నానం. కండరాలు, arthristis pain, spasm లాంటి వాటినుంచి నివారణకు hot water shower చక్కటి ఉపశమనంగా ఉంటుంది. షవర్ స్నానం లేదా.. హాట్ వాటర్ బాత్ టబ్ ను ఉపయోగించొచ్చు. 

ten natural painkillers

మరో సహజసిద్దమైన ప్రక్రియ therapeutic massage. దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల కండరాల తీవ్రత తగ్గుతుంది. కండరాలు రిలాక్స్ అయ్యి.. నొప్పి నుంచి ఉపశమనాన్ని అనుభవిస్తాయి. 

spin చుట్టూ ఉన్న soft tissues ను స్ట్రెచ్ చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. నొప్పి ఉందని కనక మీరు కదలికలు లేకుండా.. శరీరాన్ని బిగపట్టినట్టుగా ఉంటే మీ back pain మరింత పెరిగే అవకాశం ఉంది. 

ద్యానం మంచి మెడిసిన్. meditate చేయడానికి అనేక మార్గాలున్నాయి. అందుకో ఓ సులభమైన మార్గం. ప్రశాంతంగా కూర్చుని, రిలాక్స్ అవ్వడం. దీనికోసం మీ కళ్లు మూసుకుని మీ ఊపిరి మీద దృష్టి కేంద్రీకరించడమే. 

పంటినొప్పినుంచి సత్వర ఉపశమనానికి లవంగాలు బాగా పనిచేస్తాయి. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ పంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి మీ నొప్పికి బాగా పనిచేస్తాయి. 

ten natural painkillers

రన్నింగ్, ఎక్సర్ సైజ్ ల వల్ల కొన్నిసార్లు కండరాలు పట్టేస్తాయి. నొప్పి వస్తుంటుంది. ఈ రకమైన pain relive కావాలంటే.. ginger సహజసిద్దమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. రోజుకు రెండు గ్రాముల అల్లం మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఈ mucle pain మిమ్మల్ని బాధించదు. 

నడుంనొప్పి, neck pain, knee painలకి చక్కటి ఉపశమనం acupuncture. ఆంక్యుపంక్చర్ ల వల్ల ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, మైగ్రైయిన్ లు బాగా తగ్గుతాయి. లావెండర్ నూనె ఆందోళనను తొలగించి చక్కటి నిద్రకు మంచిగా పనిచేస్తుంది. లావెండర్ నూనె వాసనను పీల్చడం వల్ల మైగ్రెయిన్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. లావెండర్ నూనెను నేరుగా కాకుండా carrier oilలో కలిపి వాడాలి. 

peppermint oil అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, నొప్పినివారిణిగా బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో పెప్పర్ మింట్ ఆయిల్ ను రాసి రుద్దడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. చిల్లీపెప్పర్లలో ఉండే క్యాప్ సేసిన్ సహజంగా నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. స్కిన్ సెన్సిటివిటీని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios