సుక్కేయడంలో తగ్గేదేలే అంటున్న అతివలు..! మగజాతిని అందులో మించిపోయారుగా..
ఈ ఆధునిక కాలంలో మహిళలు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. వీరికి సాధ్యం కాని పని ఏదీ లేదంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక తాజాగా పురుషులతో సమానంగా సుక్కేయడంలో కూడా మేమేం తక్కువ కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అతివలు. ఒకరకంగా చెప్పాలంటే ఆ విషయంలో మగజాతిని ఓవర్ టేక్ చేసేసారు.
NFHS Report: ఆడవారికి స్వేచ్ఛ, సమానత్వం ఉంటే చాలు ఎలాంటి అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసేయగలరు. తమ సత్తా ఏంటో చూపించగలరు. ఇకపోతే ప్రస్తుత కాలంలో మగవారికి ఏమాత్రం తక్కువ కాదనే విధంగా తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడుతున్నారు. ఎన్నో గొప్ప రంగాల్లో కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. కెరిరీ లోనే కాదు Bad habits లోనూ ముందుంటున్నారు. అవునండీ.. ఇది నూటికి నూరు పాళ్లూ నిజం.
పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా స్మోకింగ్ చేయడంలో, ఆల్కహాల్ తాగడంలో మగువలు తగ్గడమే లేదు. ఒకరకంగా చెప్పాలంటే వారిని ఆవిషయాల్లో మించిపోయరానొచ్చు. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) వెళ్లడించింది. ఈ నివేధిక ప్రకారం.. గత ఐదేండ్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆల్కహాల్ ను సేవించారట. ఒడిశాకు సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెళ్లడించిన రిపోర్ట్ ప్రకారం.. ఈ రాష్ట్రంలో 2015-16 లో 15 ఏండ్లకు పైబడిన వారు ఆల్కహాల్ సేవించే వారు 2.4 శాతంగా ఉండేది. అదే 2020-21 నివేధికల ప్రకారం.. ఈ సంఖ్య 4.3 శాతంగా మారింది. అదే 2015-16 లో ఆల్కహాల్ ను తాగే పురుషులు 39.0 శాతంగా ఉంటే .. 2020-21 కి ఈ సంఖ్య 28.8 శాతానికి తగ్గుముఖం పట్టింది.
పట్టణాల్లోనే ఆల్కహాల్ ను తాగుతారని పొరబడకండి. ఎందుకంటే.. ఒడిషాలో పట్టణ ప్రజలకంటే గ్రామీణ ప్రజలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారట. అదికూడా 15ఏండ్ల పైనబడిన వారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు 30.2 శాతంగా ఆల్కహాల్ సేవిస్తే అదే పట్టణాల్లో 22.7 శాతంగా తాగుతున్నారట. ఇకపోతే పట్టణాల్లో ఆడవారు 1.4 శాతంగా తాగితే గ్రామాల్లో 4.9 శాతంగా ఉన్నారట.
ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఆడవారు ఆల్కహాల్ ను వినియోగించే శాతం 2.4 నుంచి 4.9 శాతానికి పెరిగింది. అదే పురుషుల విషయంలో ఇందుకు భిన్నంగా ఉంది. వీరి వినియోగం 41.3 శాతం నుంచి 20.2 శాతానికి చేరుకుంది. ఆడవారు ఆల్కహాల్ వినియోగాన్ని పెంచితే మగవారు మాత్రం తగ్గించారు. కాగా పట్టణ ప్రాంతాల్లో ఐదేండ్ల కాలం నుంచి ఆడవారి ఆల్కహాల్ వినియోగంలో పెద్ద మార్పులు రాలేదట. అయితే వీరి సంఖ్య మాత్రం 1.3 నుంచి 1.4 శాతానికి చేరుకుందని అధ్యయనం పేర్కొంటోంది.
ఇకపోతే స్మోకింగ్ లో మగజాతిని వెనక్కినేట్టేసారని సర్వే చెబుతోంది. స్మోకింగ్ చేసే మహిళలు 2015-16 లో 17.3 శాతంగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా 26 శాతానికి పెరిగిందట.
కాగా ఈ పొగాకు బానిసలైన మహిళలు పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువట. పొగాకును పట్టణాల్లో 16.6 శాతంగా వినియోగిస్తుంటే ఉంటే అదే గ్రామాల్లో 26 శాతంగా ఉన్నారు. ఇకపోతే పరుషులు మాత్రం 55.9 శాతం నుంచి 51.6 శాతానికి తగ్గారని సర్వే చెబుతోంది.