Asianet News TeluguAsianet News Telugu

తల మీద వెంట్రుకలు ఎన్ని: జుట్టు రాలుతోందా?

ఈ ఒక్క‌మాట చాలు... టీనేజ్ ని క‌ట్టి ప‌డేయ‌డానికి. టీనేజ్ పిల్లల్లో హెయిర్ ఫాల్ అనే మాట త‌ర‌చూ వినిపిస్తోంది.

Reasons for the hair fall

ఈ ఒక్క‌మాట చాలు... టీనేజ్ ని క‌ట్టి ప‌డేయ‌డానికి. టీనేజ్ పిల్లల్లో హెయిర్ ఫాల్ అనే మాట త‌ర‌చూ వినిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిల్లో.  స్లిమ్‌గా ఉండాల‌నే వెర్రి వ్యామోహంతో భోజ‌నం స‌రిగా తిన‌రు. కానీ హెయిర్ హెల్దీగా ఉండాల‌ని కోరుకుంటారు. పిల్ల‌లు హెయిర్ ఫాలింగ్ అన‌గానే *స‌రిగ్గా తింటే క‌దా పోష‌కాహారం తీసుకోక‌పోతే జుట్టు రాల‌క ఏమ‌వుతుంది * అని చాన్స్ దొరికింది క‌దా అని దాడి చేసేస్తుంటారు పేరెంట్స్‌. ఇంత‌కీ హెయిర్ ఫాల్ అంటే ఏమిటి?  జుట్టు ఎందుకు రాలుతుంది?

- మ‌న త‌ల మీద ఉండే కేశాల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు.
- త‌ల మీద దాదాపుగా ల‌క్షా యాభై వేల వెంట్రుక‌లు ఉంటాయి. 
- ప్ర‌తి రోజూ కొన్నింటికి జీవిత‌కాలం పూర్త‌వుతుంటుంది. జీవిత‌కాలం పూర్త‌యిన జుట్టు రాలిపోవాల్సిందే. అలా రాలిపోయేవి 20 నుంచి వంద వ‌ర‌కు ఉంటాయి. జుట్టు ఒత్తును బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది.
- వెంట్రుక‌ నెల‌కు అర‌ అంగుళం పొడవు పెరుగుతుంది. ఏడాది కాలంలో ఆరు అంగుళాలు పెరుగుతుంద‌న్న‌మాట‌. ఈ పెరుగుద‌ల  నార్మ‌ల్ కొల‌మానం. వ్య‌క్తికీ వ్య‌క్తికీ కొంత మారుతుంటుంది. అది పోష‌కాహారం, మంచి నిద్ర‌, శుభ్ర‌త‌, జ‌న్యుప‌రంగా జుట్టు పెరిగే తీరు... వీట‌న్నింటి మీద ఆధార‌ప‌డి ఉంటుంది.
- సాధార‌ణంగా మ‌నం జుట్టు చివ‌ర్ల‌ను రెండు  అంగుళాలు లేదా నాలుగు అంగుళాలు క‌త్తిరిస్తుంటాం. 

ఇది స్పిట్స్ ను నివారించ‌డానికి, హెయిర్ స్ట‌యిల్‌ చ‌క్క‌టి షేప్ రావ‌డానికి చేస్తుంటాం. కొద్ది నెల‌ల‌కే ఆ జుట్టు క‌త్తిరించిన మేర తిరిగి పెరుగుతుంటుంది. అది చూసి అస‌లు క‌త్తిరించ‌కుండా ఉండి ఉంటే ఇప్ప‌టికి ఎంత  పొడ‌వ‌య్యేదో అనుకుంటూ ఉంటారు. కానీ అది అపోహ మాత్ర‌మే. మ‌నిషి పొడ‌వు జ‌న్యువుల మీద ఆధార‌ప‌డిన‌ట్లే జుట్టు పొడ‌వు కూడా జ‌న్యువుల మీద ఆధార‌ప‌డి ఉంటుంది. పోష‌కాహారంతోపాటు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మ‌రికొంత తేడా వ‌స్తుంది, నిర్జీవంగా మార‌కుండా ఆరోగ్యంగా మెరుస్తుంది. అంతే త‌ప్ప క‌త్తిరించ‌నంత మాత్రాన జుట్టు అలా పెరిగిపోతూ నేల‌ను తాకడం ఉండ‌దు.

- కేశం దానికంటూ నిర్ణీత‌ పెరుగుద‌ల త‌ర్వాత విశ్రాంతి ద‌శ‌లోకి వెళ్తుంది. విశ్రాంతి ద‌శ‌లో కొన్నాళ్లు ఉన్న త‌ర్వాత రాలిపోతుంది.
-  కేశాల‌కు గ్రోయింగ్ పీరియ‌డ్‌, రెస్ట్ పీరియ‌డ్ పూర్త‌యిన‌ త‌ర్వాత రాలిపోతాయ‌ని చెప్పుకున్నాం క‌దా! అలా రాలిపోయిన ఆరు నెల‌ల లోపే ఆ రూట్‌లో కొత్త వెంట్రుక పుట్టుకొస్తుంది. ఇది హెయిర్ సైక్లింగ్‌. ఈ చ‌క్రంలో రాలిపోయిన స్థానంలో జుట్టు రాక‌పోతే దానిని హెయిర్ ఫాలింగ్ అనే చెప్పుకోవాలి. ఇది ఎలా తెలుస్తుందంటే... జుట్టు రాలిపోయిన త‌ర్వాత కుదురులో కొత్త వెంట్రుక పుట్ట‌క‌పోతే క్ర‌మంగా జుట్టు ప‌ల‌చ‌బ‌డుతుంటుంది. అదే గుర్తు.

- అలాగే రోజుకు వంద కంటే ఎక్కువ వెంట్రుక‌లు రాలిపోతుంటే కూడా హెయిర్ ఫాలింగే. ఇది రొటీన్  సైక్లింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ జుట్టు రాలుతుంటే దానికి కార‌ణం స‌మ‌తుల ఆహారం తీసుకోక‌పోవ‌డం, చుండ్రు, కాలుష్యం వంటి కార‌ణాలు ఉండ‌వ‌చ్చు. 

చివ‌ర్లు క‌త్తిరిస్తే జుట్టు రాల‌దా?

- జుట్టు చివ‌ర్లు క‌త్తిరించ‌డం ద్వారా కేశాలను విశ్రాంతి ద‌శ‌కు చేర‌నివ్వ‌కుండా నివారించ‌వ‌చ్చు. ఆ ర‌కంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌వ‌చ్చు. కేశాలు వాటి గ‌రిష్ఠ పెరుగుద‌ల ద‌శ‌కు చేర‌క ముందే క‌త్తిరిస్తుండ‌డం వ‌ల్ల వాటి పొడ‌వుకు చేర‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాయి. కాబ‌ట్టి విశ్రాంతి ద‌శ అనే స్థితి త‌లెత్త‌దు.
ఈ ప‌ద్ద‌తి రొటీన్ సైక్లింగ్‌లో రాలిపోయే కేశాల‌ను రాల‌కుండా ఆప‌డానికి ప‌నికి వ‌స్తుంది. అంతే త‌ప్ప పోష‌కాహార లోపం, త‌ల శుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే హెయిర్ ఫాలింగ్‌కి చివ‌ర్లు క‌త్తిరించే టెక్నిక్ ప‌నిచేయ‌దు.

ఇప్పుడు న‌గ‌రాల్లో ట్రైకాల‌జిస్ట్‌లు ఎక్కువ‌గానే ఉన్నారు. కానీ ట్రైకాల‌జిస్ట్ అపాయింట్ కోర‌డానికి ముందు పిల్ల‌ల‌ ఫుడ్ చార్ట్‌ను గ‌మ‌నించాలి. ఎందుకంటే లావ‌యిపోతామ‌నే భ‌యంతో, స్లిమ్‌గా ఉండాల‌నే కోరిక‌తో పిల్ల‌లు పోష‌కాహారానికి దూర‌మ‌వుతున్నారు.  అది కాక‌పోతే జంక్‌ఫుడ్ మీద జిహ్వ‌చాప‌ల్యం కొద్దీ వాటితో క‌డుపు నింపుకుంటున్నారు. దాంతో మైక్రో న్యూట్రియెంట్స్ అంద‌క ఇబ్బంది ప‌డుతుంటారు. 

అలాగే హెయిర్ క్లెన్లీనెస్‌, కేర్ గురించి చూడాలి. జుట్టు చిక్కులు లేకుండా చ‌క్క‌గా దువ్వుకోవ‌డం అల‌వాటు చేయాలి. 
రొటీన్‌గా రాలే ఇర‌వై - ముప్పై వెంట్రుక‌ల‌నే దువ్వెన‌లో చూసుకుని చూసుకుని బెంగ పెట్టుకుంటూ ఉంటే అది కేవ‌లం అపోహ మాత్ర‌మే. ఇదే మాట‌ను పిల్ల‌లు స‌మాధాన‌ప‌డేట‌ట్లు చెప్పాలి.

Follow Us:
Download App:
  • android
  • ios