నీతా అంబానీ.. పరిచయం అవసరం లేని పేరు. శ్రీరామనవమి సందర్భంగా ఆమె కట్టుకున్న ఓ స్పెషల్ చీర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ చీర కథేంటి? దాన్ని తయారుచేయడానికి ఎంత టైం పట్టింది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
Nita Ambani Saree Look: నీతా అంబానీ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో, ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈసారి కూడా అలాంటి ఓ అద్భుతమైన చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది మామూలు చీర కాదు. దానిపై పవిత్రమైన 'రామ నామం' రాసి ఉంది. ఈ చీరలో నీతా అంబానీ ఎంతో హుందాగా, క్లాసీగా కనిపించారు. ఆమె పర్సనాలిటీకి ఈ లుక్ మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. చీర గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రెండేళ్ల కష్టం.. అద్భుతమైన కళాఖండం
ఈ చీరను తయారు చేయడానికి ఏకంగా రెండేళ్ల సమయం పట్టిందట. చీరపై చేతితో ఎంతో అందంగా, సూక్ష్మంగా 'రామ నామం' అల్లారు. చీరలోని ప్రతి దారం, కళాకారుల ఓపికకు, అంకితభావానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ చీరను చూసిన చాలామంది.. ఇది కేవలం చీర కాదు.. ఓ అద్భుతమైన కళాఖండం. ఇలాంటివి తయారు చేయడానికి ఎంతో ఓపిక, నైపుణ్యం అవసరం అని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
'రామ నామం'.. భక్తికి ప్రతిరూపం
ఈ చీర ప్రత్యేకత దాని ఆధ్యాత్మికతలోనే ఉంది. హిందూ సంస్కృతిలో 'రామ నామం' ఎంతో పవిత్రమైనది. శాంతికి, శక్తికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. చీర మొత్తం 'రామ నామం' ఉండటంతో, అది ఓ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అందుకే ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, బలమైన నమ్మకానికి చిహ్నం అని కూడా చెప్పవచ్చు.
డిజైన్, అందం అదుర్స్
ఇక డిజైన్ విషయానికొస్తే గోధమ రంగులో ఉన్న ఈ చీర రాయల్‌గా కనిపిస్తోంది. బోర్డర్‌పై ఉన్న సూక్ష్మమైన డిజైన్, చీర మొత్తం అల్లిన అక్షరాల డిజైన్ దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఈ చీర అందాన్ని మరింత హైలైట్ చేయడానికి, నీతా అంబానీ సింపుల్ జ్యువెలరీ, లైట్ మేకప్ ఎంచుకున్నారు. దీంతో అందరి దృష్టి చీరపైనే ఉంది.
సోషల్ మీడియాలో వైరల్
నీతా అంబానీ ఈ చీరలో ఉన్న ఫోటోలు బయటకు రాగానే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చీర అందాన్ని, దాని తయారీ వెనుక ఉన్న కష్టాన్ని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ట్రెడిషన్, మోడ్రన్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని ఫ్యాషన్ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.


