ఇలా చేస్తే ఆడవాళ్లు తొందరగా బరువు తగ్గుతారు

International Women's Day 2023: బరువు తగ్గడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. ఒక పద్దతిని ఫాలో అయ్యి అందరూ బరువు తగ్గుతారన్న గ్యారంటీ లేదు. శరీర రకమే ఇందుకు కారణం. ఏదేమైనా కొన్ని రకాల ఆహారాలు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

International Women's Day 2023: How to choose the right diet plan for weight loss

International Women's Day 2023: కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటారు. బరువు ఎక్కువున్నా ప్రాబ్లమే.. తక్కువున్నా ప్రాబ్లమే.. ఏదేమైనా ఈ రెండు సమస్యలను తొందరగా పరిష్కరించుకోవాలి. ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఓవర్ వెయిట్ వల్ల అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పురుషులతో పోలిస్తే ఆడవాళ్లే అధిక బరువు బారిన ఎక్కువగా పడుతుంటారు. కారణం వ్యాయామం చేయకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యలు, చెడు ఆహారం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అధిక బరువును కొన్ని నెలల్లోనే తగ్గించుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి వాళ్లు ఏమేం చేసారో మీరు అవి చేసినా తగ్గకపోవచ్చు. బరువును తగ్గించే ప్రణాళికలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేయకపోవడమే ఇందుకు కారణం.

ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. నిపుణుల సలహాలు తీసుకుని ఆహార ప్రణాళికతో ఎలాంటి నొప్పి లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. కానీ బరువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆడవాళ్లు బరువు తగ్గడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • మీరు చేయాల్సిన మొదటి, ముఖ్యమైన పని ఏంటంటే.. మీ ఆహార ప్రణాళికను రూపొందించడానికి డాక్టర్ సలహా తీసుకోండి. అయితే గుర్తుంచుకోండి ప్రొఫేషనల్ అయితేనే మీకు బెస్ట్ డైట్ టిప్స్ ను సజెస్ట్ చేస్తారు. 
  • తరచుగా ఆకలి వేయకుండా చూసుకోండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అయితే ఆకలి అనేది డైటింగ్ కాదని గుర్తుంచుకోండి. అలాగే మీరు తినే సమతుల్య ఆహారంలో మాక్రోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. 
  • మీరు తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలి. మీకు నచ్చిన వాటిని కూడా అప్పుడప్పుడు తినొచ్చు. కానీ మరీ ఎక్కువగా తినేయకూడదు. మీ ఆహారంలో భారీ సప్లిమెంట్లను చేర్చొద్దు. 
  • అయితే మీరు బరువు తగ్గడానికి మీరు ఎంచుకున్న డైట్ ప్లాన్ మీ ఆహార విధానం, వ్యాయామ స్థాయికి సరిపోయేలా ఉండాలి. మీరు ఎక్కువ కష్టపడి.. పోషకాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తింటే మీ ఒంట్లో శక్తి తగ్గుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అలాగే మీరు తినే ఫుడ్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచేలా ఉండాలి. 
  • సమతుల్య , తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్, తక్కువ కేలరీలు, తక్కువ కార్భోహైడ్రేట్లు వంటి వివిధ రకాల ఆహారాలను ఎంచుకోవచ్చు. బరువు తగ్గాలని పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తింటే మీ శరీరంలో పోషక లోపం ఏర్పడుతుంది. దీనివల్ల రక్తహీనత, బలహీనమైన ఎముకలు, ఒంట్లో శక్తి తగ్గడం, లో బీపీ వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోండి. 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios