25 % కంటే ఎక్కువ ఆదాయాన్నిచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇవిగో
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ రిస్క్ తో మంచి రిటర్న్స్ ఇస్తుండటంతో ఎక్కువ మంది వీటిలో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే 25% కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలిగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఇవి మీకు కచ్చితంగా మంచి ప్రాఫిట్స్ అందిస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక పూల్ లాగా పని చేస్తాయి. ఇందులో అనేక మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును పెట్టుబడి పెడతారు. ఈ డబ్బును ఫండ్ మేనేజర్ పర్యవేక్షించి, వివిధ ఆస్తులు అంటే స్టాక్స్, బాండ్స్, డేట్స్, గోల్డ్ మొదలైన వాటిలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వ్యక్తిగత ఇన్వెస్టర్లు పెద్ద పెట్టుబడిదారుల మాదిరిగా మార్కెట్‌లో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా SIP ద్వారా ప్రజలు వివిధ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రిటర్స్న్ పొందొచ్చు. గత సంవత్సరంలో 25% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చిన అనేక మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థమవుతాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ లేదా హైబ్రిడ్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, షార్ట్-టర్మ్ ఫండ్స్, లాంగ్-టర్మ్ ఫండ్స్, ఫండ్ ఓపెన్ లేదా క్లోజ్, ఓపెన్ ఎండ్ ఫండ్స్, క్లోజ్ ఎండ్ ఫండ్స్ ఇలా చాలా రకాల పెట్టుబడి విధానాలు ఉన్నాయి.
మీకు మంచి రిటర్న్స్ రావాలంటే కొన్ని బ్యాంకులు ఇస్తున్న వివిధ రకాల ఫండ్స్ గురించి తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. 25% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి.
క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ డైరెక్ట్:
ఇందులో గ్రోత్ ఫండ్ సైజు రూ. 3,250 కోట్లు. గత 1 సంవత్సరం రాబడి 37.54 % వచ్చింది. ఖర్చు నిష్పత్తి 0.62 % గా ఉంది.
మహీంద్రా మనులైఫ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్:
గత సంవత్సరం రాబడి 28.96 %, ఖర్చు నిష్పత్తి 0.48% గా ఉంది.
UTI మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ డైరెక్ట్:
ఫండ్ సైజు రూ. 4,415 కోట్లు. గత సంవత్సరం రాబడి 28.33 % ఉండగా, ఖర్చు నిష్పత్తి 0.67 % ఉంది.
ICICI ప్రుడెన్షియల్ ఈక్విటీ, డెట్ ఫండ్:
ఇందులో ఫండ్ సైజు రూ. 40,203 కోట్లు. గత సంవత్సరం రాబడి 26.54%, ఖర్చు నిష్పత్తి 0.98 % గా ఉంది.
కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్:
ఫండ్ సైజు వచ్చేసి రూ. 6,606 కోట్లు. గత 1 సంవత్సరం రాబడి 27.59 %, ఖర్చు నిష్పత్తి 0.45 %గా ఉంది.
UTI అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్:
ఇక్కడ ఫండ్ సైజు రూ. 6,110 కోట్లు. గత 1 సంవత్సరం రాబడి 26.49 % కాగా, ఖర్చు నిష్పత్తి 1.24 %.
ఎడెల్‌వీస్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్:
ఈ ఫండ్ సైజు రూ. 2,195 కోట్లు కాగా, గత 1 సంవత్సరం రాబడి 26.47 %, ఖర్చు నిష్పత్తి 0.38 %గా ఉంది.
HDFC బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ డైరెక్ట్:
ఫండ్ సైజు వచ్చేసి రూ. 94,865. గత 1 సంవత్సరం రాబడి 25.53 %, ఖర్చు నిష్పత్తి 0.74 %.గా నమోదైంది.
స్టాక్ మార్కెట్ లేదా మరే ఇతర రంగంలో పెట్టుబడి పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.