Pregnant Women : గర్భిణులు సెల్ ఫోన్ మాట్లాడొచ్చా? లేదా? మాట్లాడితే ఏమౌతుందో తెలుసా.. గర్బిణులు సెల్ ఫోన్లు మాట్లాడితే.. కడుపులోని బిడ్డపై రేడియేషన్ ప్రభావం పడి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  


Pregnant Women : గర్బంతో ఉన్న వారు మొదటి నెల నుంచి బిడ్డ పుట్టే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. వీరు రోజూ తీసుకునే ఆహారం నుంచి వారి రోజు వారి కార్యక్రమాలు మొదలైన విషయాల్లో అప్రమత్తత ఎంతో అవసరం. కాగా మారుతున్న జీవినశైలిలో కారణంగా సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. 

ఈ సెల్ ఫోన్లను గర్భిణులు కూడా విపరీతంగా వాడుతున్నారు. గంటల తరబడి ఫోన్ మాట్లాడుతున్నారు. ఇది అంత మంచి పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత మంచిదే అయినా.. అవి రిలీజ్ చేసే రేడియో తరంగాలు మనకు ఎంతో హానీ చేస్తాయని చెబుతున్నారు. 

గర్భంతో ఉన్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు బంధుమిత్రులు ఫోన్లు చేస్తుంటారు. కానీ ఇదే అలవాటుగా మారింది. సమయాన్ని మర్చిపోయి ఎక్కువ సేపు ఫోన్లలోనే మాట్లాడుతున్నారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డ ప్రమాదంలో పడే అవకాశం చాలా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఎందుకంటే సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు వాటి నుంచి రేడియేషన్ విడుదల అవుతుంది. అది కడుపులో ఉండే బిడ్డపై పడుతుంది. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడని చూసిన వెంటనే అనిపించినా.. బిడ్డ ఎదిగే కొద్ది రేడియేషన్ తో పిల్లలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ విషయాలను ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి. 

ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, వైర్ లెస్ పరికరాలకు గర్భిణులు దూరంగా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటి నుంచి రిలీజయ్యే రేడియేషన్ పిండంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. అందుకే గర్భిణులు రేడియేషన్ కూడా దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తక్కువ రేడియేషన్ వల్ల నవజాత శిశువు పుట్టుకతో వచ్చే లోపాలు తక్కువగానే ఉంటాయట. గర్భంలో పెరిగే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిండం ఎట్టిపరిస్థితుల్లో రేడియేషన్ ప్రభావానికి గురికాకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రేడియేషన్ ప్రభావం బిడ్డపై పడితే .. వారి Brain development పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. ఈ విషయాన్ని దక్షిణ కాలిఫోర్నియా, కాలిఫోర్నియా సైంటిస్టులు తమ పరిశోధనల్లో నిర్దారించారు. అంతేకాదు పుట్టిన పిల్లల ముందు ఎక్కువ ఫోన్ ఉంచడం, వారిని ఎక్కువగా ఫోన్లలో మాట్లాడించడం వంటివి చేస్తే వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. 

గర్భిణులు రోజుకు రెండు మూడు సార్లకంటే ఎక్కువ ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదికూడా నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదట. ఇంతకన్న ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడితే మీ బిడ్డపై రేడియేషన్ ప్రభావం పడి.. బిడ్డ అనారోగ్యానికి గురవుతాడట. 

ముఖ్యంగా గర్భిణులు ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడితే వారి మానసిక ఆరోగ్యంపై చెబు ప్రభావం పడుతుందట. అంతేకాదు.. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల రాత్రిళ్లు నిద్రపట్టదట. కొంతమంది ఫోన్లో మాట్లాడకపోయినా, ఎక్కువ సేపు ఫోన్ తోనే కడపడం వల్ల తలనొప్పి, నిద్రలేమి, కంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ముఖ్యంగా మెదడు క్యార్యకలాపాలపై, ఎముకల సాంద్రతపై చెడు ప్రభావం పడుతుందట. 

గర్భంతో ఉన్నవారు ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడటం వల్ల వారు ఆందోళన, తలనొప్పి, అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయట. కాబట్టి గర్భిణులు ఫోన్ కు వీలైనంత దూరంగా ఉండండి. అప్పుడే మీరు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అయితే కాసేపు సెల్ ఫోన్ వాడినా బ్లూటూత్ లాంటి వైర్ లెస్ కాకుండా వైర్ ఉన్న హెడ్ సెట్లను మాత్రమే ఉపయోగించండి. దీనివల్ల రేడియేషన్ ముప్పు తక్కువగా ఉంటుంది.